‘పారాక్వాట్‌’ను నిషేధించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి | - | Sakshi
Sakshi News home page

‘పారాక్వాట్‌’ను నిషేధించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి

Mar 31 2026 7:44 AM | Updated on Mar 31 2026 7:44 AM

స్టేషన్‌ఘన్‌పూర్‌: దేశవ్యాప్తంగా పారాక్వాట్‌ గడ్డిమందును నిషేధించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవా లని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం పారాక్వాట్‌ గడ్డి మందు నిషేధంపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశపెట్టిన తీర్మానంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. అత్యంత ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన పారాక్వాట్‌ గడ్డి మందు నిషేధానికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి తీర్మానం ప్రవేశపెట్టడం సంతోషకరమన్నారు. రైతులు పంటపొలాల్లో కలుపు మొక్కల నివారణకు, పొలం గట్లపై గడ్డి పెరగకుండా ఉండేందుకు పారా క్వాట్‌ డైక్లోరైడ్‌ గడ్డిమందును ఎక్కువగా వినియోగిస్తారన్నారు. అనేక రైతు కుటుంబాల్లో, పేద కుటుంబాల్లో అప్పులబాధతో, కుటుంబ కలహాలతో, ఇతర సమస్యలతో క్షణికావేశంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించేవారు ఎక్కువగా ఈ గడ్డిమందును వాడుతున్నారన్నారు. ఈ మందుకు విరుగుడు లేకపోవడంతో బతకాలనే ఆశ ఉన్నప్పటికీ బతకలేని దుర్భర పరిస్థితులు ఉన్నాయని వెల్ల డించారు. ఈనెల 27న ఎంపీ కడియం కావ్య పారాక్వాట్‌ గడ్డిమందును నిషేధించాలని పార్లమెంట్‌లో లేవనెత్తారన్నారు. గడ్డిమందు నిషే ధంపై తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శకంగా, దిక్సూచిగా ఉండాలని పేర్కొన్నారు.

గుండెపోటుతో

ఉపాధ్యాయుడి మృతి

పర్వతగిరి: ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు విధులు నిర్వర్తిస్తూనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం టూక్యానగర్‌లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. టూక్యానగర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌(46) సోమవారం విధులకు హాజరయ్యాడు. పాఠం బోధిస్తున్న క్రమంలో గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. గమనించిన స్థానికులు వెంటనే నెక్కొండలోని ఓ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా, మృతుడు చంద్రశేఖర్‌ది సంగెం మండలం కాట్రపల్లి గ్రామం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసంద్రంలో మునిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement