నర్సంపేట మున్సిపాలిటీకి రూ.30 కోట్లు మంజూరు
నర్సంపేట: నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.30 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎంను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌నకు దరఖాస్తులు
న్యూశాయంపేట: జిల్లాలోని అల్పసంఖ్యాక వర్గాల (ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్శీలు) విద్యార్థులు విదేశాల్లో పైచదువులు చదువుకొనేందుకు సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి టి.రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చేనెల 19వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. వివరాలకు 93988 60995 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
ట్రాన్స్‌జెండర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
కాళోజీ సెంటర్: జిల్లాలోని ట్రాన్స్‌జెండర్లకు ఆర్థిక పునరావాస పథకం కింద రూ.75 వేల చొప్పున 8 యూనిట్లకు 100 శాతం సబ్సిడీపై అవకాశం కల్పించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజమణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ట్రాన్స్‌జెండర్ల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 31లోపు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.
నేడు జిల్లాస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల ఎంపికలు
సంగెం/వర్ధన్నపేట: జిల్లాస్థాయి మోడ్రన్ కబడ్డీ ఎంపిక పోటీలను పర్వతగిరి మోడల్ స్కూల్‌లో నిర్వహించనున్నట్లు మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తూరు సమ్మయ్య, కార్యదర్శి డెక్క లోకేష్, కోశాధికారి రవి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం సీనియర్ పురుషులు, సీ్త్రల కబడ్డీ జట్ల ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 17 సంవత్సరాల పైబడి 85 కిలోల లోపు బరువు కలిగి ఉండాలని తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికై న క్రీడాకారులు ఈనెల 26నుంచి ఖమ్మంలో జరగనున్న తెలంగాణ రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 77807 05024, 87901 54679 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
జిల్లాస్థాయి పోటీలకు ఎంపిక
సంగెం: జిల్లాస్థాయి గణిత ప్రతిభా పోటీలకు ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు మండల గణిత ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు సత్యమూర్తి, పులి శిరీష తెలిపారు. సంగెం జెడ్పీహెచ్‌ఎస్‌లో శనివారం నిర్వహించిన మండల స్థాయి గణిత ప్రతిభా పోటీల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లాస్థాయి పోటీలకు బి.విష్ణువర్ధణ్, పి.భరత్ (జెడ్పీహెచ్‌ఎస్), వి.జానేశ్వరి (కేజీబీవీ సంగెం) ఎంపికై నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల గణిత ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
లారీ ఢీకొని విరిగిన విద్యుత్ స్తంభం
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 15వ డివిజన్ గొర్రెకుంట ప్రధాన రోడ్డు ఎస్సీ కాలనీ వద్ద శనివారం తెల్లవారుజామున ఓ లారీ ఢీకొని విద్యుత్ స్తంభం విరిగిందని స్థానికులు తెలిపారు. విద్యుత్‌శాఖ వారికి సమాచారం అందించగా వారు వచ్చి విరిగిన స్తంభం స్థానంలో కొత్తది ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అయితే, గొర్రెకుంట – పోతరాజుపల్లి రహదారి విస్తరణ సందర్భంగా గతంలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించకుండా అలాగే వదిలేయడంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. గ్రీవెన్స్‌లో అధికారులకు పలుమార్లు విన్నవించినా సమస్యకు పరిష్కారం లభించడం లేదని గొర్రెకుంట వాసులు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డుపై ఉన్న స్తంభాలను తొలగించి రోడ్డు పక్కన ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు.
నర్సంపేట మున్సిపాలిటీకి రూ.30 కోట్లు మంజూరు
నర్సంపేట మున్సిపాలిటీకి రూ.30 కోట్లు మంజూరు


