20 రోజులుగా తాగునీరు బంద్
నర్సంపేట: నర్సంపేట పట్టణం ఒకటో వార్డులో గత 20 రోజులుగా తాగునీరు సరిగారాక స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో మహిళలు శనివారం నిరసన తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక మాజీ కౌన్సిలర్ దేవోజు తిరుమల మాట్లాడుతూ గతేడాది నుంచి మిషన్ భగీరథ పైపులైన్‌కు పలుచోట్ల లీకేజీలు ఏర్పడ్డాయని అన్నారు. అలాగే, పలు ఇళ్లకు మిషన్ భగీరథ పైపులైన్ కనెక్షన్లు ఇవ్వలేదని తెలిపారు. లీకేజీలకు మరమ్మతులు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తిరుమల విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎండీ.అబ్దుల్‌పాషా, దంచనాదుల సతీష్, కూరపాటి క్రిస్టఫర్, సంకినేని హనుమంతరావు, దంచనాదుల రాజు, మొగిలిచర్ల లక్ష్మి, భూక్య మంజుల, భూక్య సునీత, జాటోత్ విజయ, నల్లబెల్లి మంజుల, విజయ, ఎండీ.గౌస్యబేగం, ఎండి.కౌసర్, ఎండి.హసినా, ఎండి.జరానీ, ఎండి.సాజియా, ఎండి.నూర్, జాటోతు రమేష్, ఎండి.సర్వర్, బోడ శివరామకృష్ణ, శ్రీపెళ్లి రమ, మల్యాల నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట స్థానికులు, మహిళల నిరసన


