బాలల హక్కులకు భంగం కలిగించొద్దు
● జిల్లా న్యాయసేవా సంస్థ జడ్జి రాజ్‌నిధి
కాళోజీ సెంటర్: బాలల హక్కులకు భంగం కలిగించొద్దని, వారి హక్కులు, భవిష్యత్‌కు విఘాతం కలగకుండా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయసేవా సంస్థ జడ్జి రాజ్‌నిధి అన్నారు. బాలల హక్కులపై వరంగల్‌లోని మట్వాడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ విద్యార్థులకు వారి హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో చదివి చదువులో రాణించాలన్నారు. అనంతరం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్, పోషకాహారోత్సవంలో జడ్జి పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎంఓ డాక్టర్ కట్ల శ్రీనివాస్, పాఠశాల హెచ్‌ఎం అరుణ, ఉపాధ్యాయులు భిక్షపతి, కిరణ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.


