కాంగ్రెస్ మద్దతుతో 212 జీపీల్లో విజయం
వరంగల్: ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలోని మొత్తం 317 గ్రామ పంచాయతీలకు గాను 212 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారని వరంగల్ డీసీసీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌ను శనివారం కలిసి నివేదికలు అందజేశారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బీజేపీ కార్యాలయాల ఎదుట చేపట్టిన ధర్నా విషయాలను వారితో చర్చించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై నిరసిస్తూ కార్యక్రమాలు చేపట్టినట్లు అయూబ్ తెలిపారు.


