వరంగల్
శనివారం శ్రీ 20 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి కోరారు. కేయూ పరిధిలోని అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ మీట్ కేయూ క్రీడామైదానంలో ప్రారంభించారు.
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్ జిల్లాల్లో శనివారం చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జనగామ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మూడు రోజుల నుంచి ఏకంగా రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. 11.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 9.8 డిగ్రీల సెల్సియస్ మధ్య శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వరంగల్, హనుమకొండ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో 8.4 డిగ్రీలు, 9.2 డిగ్రీలు, 8 డిగ్రీలు, 6.8 డిగ్రీలు, 8.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు శనివారం నమోదవుతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం, రాత్రి వేళ అవసరముంటేనే బయటకు రావాలని సూచించింది.
ఉన్ని దుస్తులకు డిమాండ్..
చలి రోజురోజుకు పెరుగుతుండడంతో మార్కెట్‌లో స్వెటర్లకు డిమాండ్ బాగా పెరిగింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతిఒక్కరూ ఉన్ని దుస్తులు లేనిదే బయటకు రావడం లేదు. మఫ్లర్లు కూడా వాడుతున్నారు. చెవిలోకి చల్లటి గాలి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం నడక కోసం పార్కులకు వచ్చే వారి సంఖ్య కూడా తగ్గింది. ఉదయం వేళ పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు కూడా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.


