సోలార్ ప్లాంటుకు స్థల పరిశీలన
గీసుకొండ: కొనాయమాకుల–వంచనగిరి మధ్యలో ఉన్న 16 ఎకరాల ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాల్వ భూమిలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంటు ప్రతిపాదనను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తామని అదనపు డీఆర్‌డీఓ రేణుకాదేవి అన్నారు. కాకతీయ కాల్వ వద్ద సోలార్ ప్లాంటు ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూమిని సంబంధిత శాఖల అధికారులతో కలిసి శుక్రవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. ఒక మెగావాట్ సామర్థ్యం గల సోలార్ ప్లాంటును సెర్ప్ మహిళా సంఘాల వారు ఏర్పాటు చేస్తారని తెలిపారు. అధికారులతో కలిసి కేటాయించిన భూమి హద్దులను పరిశీలించారు. ఎన్పీడీసీఎల్ డీఈ దానయ్య, ఏడీ రవి, ఏఈ సంపత్‌కుమార్, లైన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, టీజీ రెడ్‌కో ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ జిల్లా మేనేజర్ రాజేందర్, ఫీల్డ్ ఇంజనీర్ నవీన్‌కుమార్, డైనేరా కంపెనీ సైట్ ఇంజనీర్ ముస్తఫా, ఐబీ ఏఈ సాయిరాజు, డీపీఎం దాసు, మండల ప్రాజెక్టు మేనేజర్ ముక్కెర సతీశ్ స్థల పరిశీలన చేసి సోలార్ ప్లాంటు ఏర్పాటుపై చర్చించారు. సర్వేయర్ భాస్కర్ ప్లాంటు ఏర్పాటు కోసం కేటాయించిన స్థలం హద్దులను అధికారులకు చూపించారు.


