హస్తం హవా
72 స్థానాల్లో కాంగ్రెస్, 33 స్థానాల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారుల విజయం
మూడో
విడత
ఖానాపురం: బుధరావుపేటలో సంబురాలు చేసుకుంటున్న కాంగ్రెస్ నేతలు
సాక్షి, వరంగల్: పంచాయతీ మూడో విడత పోరులో కాంగ్రెస్ మద్దతుదారులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు. చెన్నారావుపేట, ఖానాపురం, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో బుధవారం జరిగిన ఎన్నికల్లో 109 పంచాయతీల్లో 72 మంది కాంగ్రెస్ మద్దతుదారులు గెలిస్తే.. 33 మంది బీఆర్‌ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ ఖాతా కూడా తెరవలేకపోయింది. ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయబావుటా ఎగురవేశారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత మండలం చెన్నారావుపేట మండలంలో 30 పంచాయతీలకు 22 స్థానాలు కాంగ్రెస్ దక్కించుకుంది. ఏడు స్థానాలు గెలుచుకున్న బీఆర్‌ఎస్ 6 మేజర్, పెద్ద పంచాయతీల్లో పాగా వేయడం కాస్త ప్రతికూలమనే చర్చ జరుగుతోంది. చెన్నారావుపేట, పాపాయ్యపేట, జల్లీ, లింగగిరి, తిమ్మరాయినిపహాడ్ మేజర్, ఎక్కువ ఓటర్లున్న గ్రామ పంచాయతీలను బీఆర్‌ఎస్ కై వసం చేసుకుంది. ముఖ్యంగా చెన్నారావుపేట మేజర్ గ్రామ పంచాయతీలో 11 వార్డులు కాంగ్రెస్ గెలుచుకున్నా.. సర్పంచ్ మాత్రం బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలవడం పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే దొంతి సొంతూరు అమీనాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ధారా రజిత విజయం సాధించడం కాస్త ఊరటనిచ్చినట్లయ్యింది. ఖానాపురం మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్‌ఎస్ గెలవగా, నర్సంపేట, నెక్కొండ మండలాల్లోని పెద్ద పంచాయతీల్లో హస్తం పైచేయి సాధించింది.
వరుసగా రెండోసారి విజయం..
నర్సంపేట మండలం భోజ్యానాయక్ తండాలో తాజా మాజీ సర్పంచ్ భూక్యా లలిత మళ్లీ ఇప్పుడు బీఆర్‌ఎస్ పార్టీ నుంచే పోటీచేసి 14 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈమెకు 355 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్యా రోజాకు 341 ఓట్లు వచ్చాయి.
సింగిల్ డిజిట్ మెజార్టీతో గెలిచిన సర్పంచ్‌లు..
● నర్సంపేట మండలం జీజీఆర్‌పల్లి సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపర్చిన భూస నరసయ్య ఒక్క ఓటుతో గెలిచారు. ఈ గ్రామంలో 453 ఓట్లు ఉండగా 421 మంది ఓటేశారు. వీటిలో భూస నరసయ్యకు 191 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కత్తుల కుమారస్వామి (బీఆర్‌ఎస్)కి 190 ఓట్లు వచ్చాయి. మూడు చెల్లని ఓట్లుగా అధికారులు నిర్ధారించారు. అయితే, కుమారస్వామి రీకౌంటింగ్‌కు పట్టుబట్టగా అధికారులు మళ్లీ ఓట్లు లెక్కించగా యథావిధిగానే వచ్చాయి..
● ఖానాపురం మండలం అయోధ్యనగర్ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి కూస విమల నాలుగు ఓట్ల తేడాతో గెలిచారు. జనరల్ మహిళకు రిజర్వ్ అయిన ఈ గ్రామంలో 510 ఓట్లు ఉండగా 463 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీటిలో కూస విమలకు 226 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి ఎర్ర రజితకు 222 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి శ్రీరామోజు ఉమకు 10 ఓట్లు పడ్డాయి. పోలైన ఓట్లలో తిరస్కరించిన ఓట్లు ఐదు ఉండడం గమనార్హం.
● నెక్కొండ మండలం మడిపల్లి సర్పంచ్‌గా కాంగ్రెస్ అభ్యర్థి ఆంగోత్ అనూష ఐదు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అజ్మీరా మంగ్యా నాయక్ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ అభ్యర్థి మాలోత్ వెంకట్ ఆరు ఓట్ల మెజార్టీతో గెలిచారు.
పంచాయతీలు
కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ–0 ఇతరులు
109
72
33
మరిన్ని ఎన్నికల వార్తలు 8లోu మూడో విడత సర్పంచ్‌లు వీరే 9లోu
ఖాతా తెరవని బీజేపీ, ఐదుచోట్ల స్వతంత్రుల జయకేతనం
మూడో విడత ఎన్నికల ఫలితాలు ఇలా..
మండలం పంచాయతీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
చెన్నారావుపేట 30 22 7 0 1
ఖానాపురం 21 12 9 0 0
నర్సంపేట 19 11 6 0 2
నెక్కొండ 39 27 11 0 1
హస్తం హవా
హస్తం హవా
హస్తం హవా
హస్తం హవా


