హస్తం గెలిచి.. కారు నిలిచి
మూడో దశ ఎన్నికల్లో జిల్లాలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల విజయం
సాక్షి, ప్రతినిధి, వరంగల్:
జిల్లాలో బుధవారం జరిగిన మూడో దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు మెజార్టీ స్థానాల్లో గెలిస్తే.. బీఆర్‌ఎస్ పార్టీ కూడా తామేమీ తక్కువకాదంటూ గట్టి పోటీనిచ్చింది. ఆత్మకూరు, నడికూడ, దామెర, శాయంపేట మండలాల్లోని 68 పంచాయతీల్లో 37 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే.. 22 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయఢంకా మోగించారు. బీజేపీ నాలుగు, స్వతంత్రులు ఐదు స్థానాల్లో నెగ్గారు. ఈ ఐదుగురు స్వతంత్రుల్లో శాయంపేట, పత్తిపాక, తెహరపూర్ పంచాయతీల్లో ముగ్గురు కాంగ్రెస్ రెబల్స్ ఉన్నారు. పరకాల నియోజకవర్గంలోనే ఈ నాలుగు మండలాలు ఉండడంతో ఎమ్మెల్యే రేవూరికి కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలవడం కాస్త సంతృప్తినిచ్చినా, బీఆర్‌ఎస్ కూడా ప్రభావం చూపడం హస్తం పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తుపై జరగనుండడంతో అప్పటివరకు ఎక్కడ బలహీనంగా ఉన్నామో, అందుకు గల కారణాలు విశ్లేషించుకుని ముందుకెళ్లాలన్న చర్చ కార్యకర్తల్లో జరుగుతోంది.
పట్టు నిలుపుకున్న డీసీసీ అధ్యక్షుడు
ఆత్మకూరు: హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి స్వగ్రామం ఆత్మకూరులో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి పర్వతగిరి మహేశ్వరి గెలుపొందారు. మహేశ్వరి గెలుపు కోసం వెంకట్రామ్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. తన మద్దతుదారు గెలవడంతో వెంకట్రామ్‌రెడ్డి అభినందనలు తెలిపారు. మహేశ్వరి గెలుపు సొంత గ్రామంలో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న తనకు తొలి విజయమని ఆయన పేర్కొన్నారు.
వసంతాపూర్‌లో లాఠీచార్జ్
శాయంపేట: మండలంలోని వసంతాపూర్ గ్రామంలో ఉపసర్పంచ్‌ను ఎన్నుకునే సమయంలో సర్పంచ్, వార్డు సభ్యుల మధ్య ఘర్షణ ఏర్పడింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వసంతాపూర్‌లో 8 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ 5, బీఆర్‌ఎస్ 1, స్వతంత్రులు 2 స్థానాలు గెలుపొందారు. ఉపసర్పంచ్‌ను ఎన్నుకునే క్రమంలో ఇద్దరు అభ్యర్థులకు నలుగురు, నలుగురు చొప్పున ఓట్లు వేశారు. సర్పంచ్.. తన ఇంటి పక్కనే ఉన్న తౌటు శ్రీనును బలపర్చారు. మిగిలిన వార్డు సభ్యులతో సహా 150 మంది గ్రామస్తులు సర్పంచ్ హింగె భాస్కర్ ఇంటి ఎదుట ‘సర్పంచ్ డౌన్ డౌన్’ అంటూ ధర్నా చేశారు. దీంతో ఎస్సై జక్కుల పరమేశ్ సిబ్బందితో చేరుకుని లాఠీచార్జ్ చేసి ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టారు. ఇందులో వసంతాపూర్ ఎన్నికల ఇన్‌చార్జ్ కాంగ్రెస్ నాయకులు అప్పం కిషన్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
మూడో విడత ఫలితాలు..
హనుమకొండ జిల్లాలో..
మండలం పంచాయతీలు కాంగ్రెస్ బీఆర్‌ఎస్ బీజేపీ ఇతరులు
ఆత్మకూరు 16 10 4 1 1
నడికూడ 14 08 06 0 0
దామెర 14 04 08 02 0
శాయంపేట 24 15 04 01 04
మొత్తం 68 37 22 4 5
దామెర మండలంలో బీఆర్‌ఎస్ జోరు, నడికూడలోనూ ప్రభావం
శాయంపేట: 24 పంచాయితీల్లో 15 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు
పెద్దగా ప్రభావం చూపని భారతీయ జనతా పార్టీ
హస్తం గెలిచి.. కారు నిలిచి
హస్తం గెలిచి.. కారు నిలిచి
హస్తం గెలిచి.. కారు నిలిచి
హస్తం గెలిచి.. కారు నిలిచి


