పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
శాయంపేట: శాయంపేట, దామెర మండల కేంద్రాల్లో నిర్వహించిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మండల కేంద్రంలో పోలింగ్ సరళిని, ఓటింగ్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. మండలంలో రెండు వేలకుపైగా ఓటర్లున్న గ్రామ పంచాయతీలు నాలుగు టేబుల్స్ వేసి కౌంటింగ్ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ కేంద్రాల్లో ప్రారంభమయ్యే ప్రక్రియను అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఆమె వెంట డీఆర్డీఓ మేన శ్రీను, పరకాల ఆర్డీఓ నారాయణ, మండల ప్రత్యేక అధికారి జయంతి, తహసీల్దార్ ప్రవీణ్‌కుమార్, ఎంపీడీఓ ఫణిచంద్ర, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన డీసీపీ
శాయంపేట: మండలంలోని మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను బుధవారం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ పరిశీలించారు. ఈసందర్భంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఆయన వెంట ఏసీపీలు సతీశ్‌బాబు, సత్యనారాయణ, సీఐ రంజిత్ రావు, ఎస్సై జక్కుల పరమేశ్, సిబ్బంది ఉన్నారు.


