గుడిసెవాసులకు ఇళ్ల పట్టాలివ్వాలి
సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు నాగయ్య
ఖిలా వరంగల్: జక్కలొద్ది రామ సురేందర్‌నగర్ గుడిసె వాసులందరికీ ఇళ్ల పట్టాలివ్వాలని, లేకపోతే గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు పంచాలని సీపీఎం కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జి.నాగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఖిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం జిల్లా సహాయ కార్యదర్శి నలిగంటి రత్నమాల అధ్యక్షతన సీపీఎం నాయకుల రిలే నిరాహార దీక్షను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తూర్పాటి కవిత, మైదం వినోదమ్మ, దుప్పటి రమ్య పాల్గొన్నారు.


