నాణ్యమైన విత్తనాలను విక్రయించాలి
సంగెం: నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు విక్రయించాలని, లేదంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఏడీఓ నర్సింగం హెచ్చరించారు. మంగళవారం సంగెం మండలంలో పలు గ్రామాల్లోని విత్తన దుకాణాల్లో లైసెన్సులు, సోర్స్ సర్టిఫికెట్లు, స్టాక్ రిజిస్టర్లు, బిల్లు బుక్కులు పరిశీలించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డీలరు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వ్యాపారం చేయాలన్నారు. డీలర్లు కొనుగోలు చేసినవాటికి బిల్లులు కలిగి ఉండాలని, అమ్మిన వాటికి రైతులకు బిల్లులు ఇవ్వాలన్నారు. రైతులకు విస్తీర్ణం బట్టి విత్తనాలు ఇవ్వాలని అదనపు విత్తనాలు ఇవ్వద్దన్నారు. గడువు తీరిన విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు షాపులో నిల్వ ఉంచకూడదన్నారు. ఈ కార్యక్రమంలో డీఏఓ కార్యాలయ అధికారులు దయాకర్, రంజిత్, సాగరిక, మండల వ్యవసాయాధికారి జగదీశ్వర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


