అధికారులు బాధ్యతతో పనిచేయాలి
ఎన్నికల
పరిశీలకురాలు బాలమాయాదేవి
ఖానాపురం: ఎన్నికల విధుల్లో అధికారులు బాధ్యతతో పనిచేయాలని ఎన్నికల పరిశీలకురాలు బాలమాయాదేవి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని హైస్కూల్ ఆవరణలో పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సత్యశారదతో కలిసి పరిశీలించా రు. పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి, ఎన్నికలు విజయవంతం చేయాలన్నారు. కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక వసతి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీటీడీఓ సౌజన్య, తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ అద్వైత, ఎంపీఓ సునీల్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
అధికారులు బాధ్యతతో పనిచేయాలి


