తుది విడతకు సిద్ధం
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 17 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
మంత్రి కొండా సురేఖను కలిసిన సర్పంచ్‌లు
గీసుకొండ: మండలంలో సర్పంచ్‌లుగా గెలుపొందిన పలువురు రాష్ట్ర దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండలోని తన నివాసంలో రాంపురం, మనుగొండ, సూర్యతండా సర్పంచ్‌లు రడం భరత్, పేర్ల శ్రవణ్, బానోతు రాఘవేంద్రతోపాటు గీసుకొండ సర్పంచ్ వీరగోని రాజ్‌కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకుడు, సామాజిక సేవకుడు అల్లం బాలకిషోర్‌రెడ్డి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్‌లను మంత్రి శాలువాలతో సన్మానించారు.
జాతీయ రహదారిపై
రాస్తారోకో
నల్లబెల్లి: మండలంలోని రుద్రగూడెం గ్రామంలో భగీరథ నీటి కోసం గ్రామస్తులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. గత కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని జాతీయ రహదారిపై రాస్తారోకో చేయడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.
దళితుల అభ్యున్నతే లక్ష్యం
వర్ధన్నపేట: పేదల అభ్యున్నతే లక్ష్యంగా మాస్ సంస్థ పనిచేస్తుందని వర్ధన్నపేట మున్సిపల్ కమిషనర్ ఇమ్మడి సుధీర్‌కుమార్, సంస్థ ప్రతినిధి డాక్టర్ సీనపల్లి విజయ్ కుమార్‌లు అన్నారు. మండలంలోని అంబేడ్కర్ నగర్ గ్రామానికి చెందిన బంక సుమాంజలి పాలిటెక్నిక్ డిప్లొమా ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదువులో ప్రతిభ ఉన్నా.. ఆర్థికంగా వెనుకబడి ఉన్న కుటుంబం కావడంతో మహా ఆదిసేవ సంస్థ సభ్యులు డాక్టర్ విక్రమ్‌కుమార్ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంగళవారం సంస్థ నుంచి రూ.20 వేలు విద్యార్థినికి అందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు డాక్టర్ శివశంకర్, గాయాల సుమన్, తుమ్మల శ్రీధర్, చిలు ముల రవి, సూరాప్ నిరంజన్ పాల్గొన్నారు.
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
నర్సంపేట: పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు అన్నారు. ఈ మేరకు పట్టణంలో పట్టణ అధ్యక్షుడు గూడూరు సందీప్, మండల అధ్యక్షుడు తనుగుల అంబేడ్కర్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ నూతన కార్యాలయాన్ని మాజీ పార్లమెంటు సభ్యుడు అజ్మీర సీతారాంనాయక్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్‌రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ పార్టీ బలోపేతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నర్సింహరాములు, జిల్లా ఉపాధ్యక్షుడు రేసు శ్రీనివాస్, అజ్మీర శ్రీను, పార్లమెంటు కో కన్వీనర్ కట్ల రామచందర్‌రెడ్డి, తడుక వినయ్, ఓరుగంటి మాధురిరాజు, నాయకులు కూనమల్ల పృద్వీరాజ్, మల్లయ్య, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
వలంటీర్లు అవగాహన కల్పించాలి
వరంగల్ అర్బన్: ఇంటింటా తడి, పొడి చెత్త వేరు చేసేలా కాలనీల్లో అవగాహన కల్పించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. మంగళవారం శానిటేషన్ తనిఖీలో భాగంగా వరంగల్‌లోని 25, 26వ డివిజన్లలో కమిషనర్ క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య విధానాలు తనిఖీ చేశారు. ఆమె వెంట ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఏసీపీ ఖలీల్, శానిటరీ సూపర్‌వైజర్ భాస్కర్, ఏఈ హబీబ్, టీఎంసీ రమేశ్, కమ్యూనిటీ ఆర్గనైజర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి, వరంగల్: జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నర్సంపేట డివిజన్‌లోని ఖానాపురం, చె న్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాల్లో మొత్తం 102 పంచాయతీలు, 890 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మంగళవారం నర్సంపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణ, నెక్కొండలో మహేశ్వరీ గార్డెన్, ఖానాపురంలో జెడ్పీహెచ్‌ఎస్, చెన్నారావుపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. నేడు ఉదయం 7 నుంచి 1గంట వరకు పోలింగ్, మధ్యాహ్నం 2 నుంచి కౌంటింగ్ మొదలు కానుంది. మొత్తం 102 పంచాయతీలకు 312 మంది, 890 వార్డుల కోసం 1,974 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ముతండాలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు, దాడులు జరగడంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడ గొడవలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రలోభాల ఎర
ఆయా అభ్యర్థులు ఎలాగైన గెలవాలనే పట్టుదలతో ఓటర్లకు ప్రలోభాల పర్వానికి తెరలేపారు. మంగళవారం రాత్రి నుంచి ఓటర్లకు డబ్బులు, మద్యం బాటిళ్లతో పాటు చికెన్, మటన్ పంపిణీ చేస్తుండటంతో ఆయా గ్రామాల్లో సందడి నెలకొంది. వలస ఓటర్లకు ఫోన్‌కాల్ చేసి రవాణా ఖర్చులు ఇస్తామని, గ్రామానికి వచ్చి ఓటు వేసి వెళ్లాలంటూ అభ్యర్థిస్తున్నారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటివరకు ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందాలు రూ.6,50, 000ల నగదు, రూ.8,42,584 విలువైన మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంది.
నువ్వా..నేనా..
జిల్లాలో మొదటి, రెండో విడత ఎన్నికలు ఆసక్తి రేపగా మూడో విడతలో జరిగే మండలాల్లో పోటాపోటీగా ఉంది. తొలి దశ ఎన్నికల్లో 56 స్థానాలు కాంగ్రెస్ మద్ధతుదారులు, 26 స్థానాలు బీఆర్‌ఎస్ మద్ధతుదారులు, రెండో విడతలో 70 మంది కాంగ్రెస్ మద్ధతుదారులు, 40 స్థానాలు బీఆర్‌ఎస్ మద్ధతుదారులు గెలుచుకున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే న ర్సంపేట, ఖానాపురం, నెక్కొండ, చెన్నారావుపేట మండలాలు నర్సంపేట నియోజకవర్గంలోనే ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య పోటాపో టీ వాతావరణం ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మా ధవరెడ్డి సొంతూరు చెన్నారావుపేట మండలం అ మీనాబాద్ పంచాయతీ ఫలితం కూడా జనాల్లో ఆసక్తిని రేపుతోంది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రాబల్యం చూపాలంటే ఈ మండలాల్లో పంచాయతీల్లో మెరుగైన ఫలితాలు తీసుకురావా ల్సి ఉండగా, అంతేస్థాయిలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కూడా బీఆర్‌ఎస్ ప్రభావం చూపేందుకు ముఖ్యమైన గ్రామాల్లో ఇప్పటికే ప్రచారం చేసి పైచేయి సాధించాలనుకుంటున్నారు. దీంతో మూడో ఎన్నికల ఫలితాలు జిల్లా అంతటా ఆసక్తిని రేపుతున్నాయి.
మూడో దశ ఓటర్ల వివరాలు..
నిట్‌లో వర్క్‌షాప్ ప్రారంభం
కాజీపేట అర్బన్: నిట్ సెమినార్‌హాల్ కాంప్లెక్స్‌లో స్పార్క్ (స్కీం ఫర్ ప్రమోషన్ ఆఫ్ అకడమిక్ అండ్ రీసెర్చ్ కొలాబరేషన్) సౌజన్యంతో సస్టేనబుల్ వేస్ట్ వాటర్ ట్రీట్‌మెంట్ అనే అంశంపై 6 రోజుల ఇంటర్నేషనల్ వర్క్‌షాప్ మంగళవారం ప్రారంభమైంది. నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ జ్యోతి ప్రజ్వలన చేసి ఇంటర్నేషనల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించి మాట్లాడారు. నిట్ వరంగల్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఎంసీ గిల్ యూనివర్సిటీ కెనడా సంయుక్తంగా వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నేడు మూడో విడత జీపీ ఎన్నికలు
ఉదయం 7 నుంచి మధ్యాహ్నం
1 గంట వరకు పోలింగ్
డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను
సందర్శించిన కలెక్టర్ సత్యశారద
102 సర్పంచ్,
890 వార్డు స్థానాలకు ఎన్నికలు
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంతూరు అమీనాబాద్ ఫలితంపై ఉత్కంఠ
గ్రేటర్‌లో చలిపంజాకు
నిరాశ్రయుల విలవిల
నైట్ షెల్టర్లపై అంతులేని నిర్లక్ష్యం
దూర ప్రాంతాల్లో ఉండడంతో
నిరుపయోగం
మండలం పురుషులు మహిళలు ఇతరులు
ఖానాపురం 13,571 14,403 4
చెన్నారావుపేట 15,747 16,124 1
నర్సంపేట 11,043 11,429 0
నెక్కొండ 22,698 23,734 2
మొత్తం 63,059 65,690 7
తుది విడతకు సిద్ధం
తుది విడతకు సిద్ధం
తుది విడతకు సిద్ధం
తుది విడతకు సిద్ధం
తుది విడతకు సిద్ధం


