ఆకట్టుకునేలా హరిత పోలింగ్ కేంద్రాలు
నర్సంపేట: జిల్లాలో మూడో విడతలో జరగనున్న ఎన్నికలకు పలు పోలింగ్ కేంద్రాలను గ్రీన్ పోలింగ్ కేంద్రాలు గా సిద్ధం చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ కేంద్రాల్లో ఆకుపచ్చని తోరణాలు, మామిడాకులు, రంగురంగుల ముగ్గులు వేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. సెల్ఫీపాయింట్ ఏర్పాటు చేశారు. నర్సంపేట మండలం లక్నెపల్లి, ఇటుకాలపల్లి, ఖానాపు రం మండలం ఖానాపురం, రాగంపేట, చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి, తిమ్మరాయినిపహాడ్, నెక్కొండలోని రెడ్లవాడ, అలంకానిపేట పోలింగ్ కేంద్రాలను హరిత కేంద్రాలుగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
ఆకట్టుకునేలా హరిత పోలింగ్ కేంద్రాలు


