ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
● జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ సత్యశారద
● డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల పరిశీలన
నర్సంపేట/నెక్కొండ: జిల్లాలో మూడో విడత ఎన్ని కలు పాదర్శకంగా, పటిష్టంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. చెన్నారావుపేట ఎంపీడీఓ కార్యాలయ ఆవరణ, నెక్కొండలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ విధానం, భద్రతా ఏర్పాట్లు, సిబ్బందికి కల్పించిన సౌకర్యాలు పరిశీలించి అధికారులతో సమీక్షించారు. ఏమైన సమస్యలు ఉంటే జోనల్, రూట్ అధికారులకు తెలియజేయాలన్నారు. పోలింగ్ కేంద్రాలకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఓటరు జాబితా, ముద్రలు, ఫారాలు తదితర ఎన్నికల సామగ్రి సమయానికి, పూర్తి స్థాయిలో అందేలా చూడాలన్నారు. ఎ న్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు బాధ్యతతో పని చేసి ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా ముగిసేలా సమన్వయంతో పనిచేయాలన్నా రు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీసీఈఓ రాంరెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, సుమా, మండల ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, ఎంపీడీఓ, తహసీల్దార్, సిబ్బంది పాల్గొన్నారు.


