కోట అభివృద్ధికి అడుగులు
ఖిలా వరంగల్: చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోటలో ప్రపంచ పర్యాటకులను ఆకర్శించే స్థాయిలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వర్చువల్ రియాల్టీని అందుబాటులో తీసుకుని రావడానికి మంత్రి కొండా సురేఖ కసరత్తు చేశారు. ఆమె ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం ఖిలా వరంగల్ మధ్యకోటలోని శిల్పాల ప్రాంగణాన్ని హైదరాబాద్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి రంజిత్ నాయక్, డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్, వరంగల్ డీఆర్‌ఓ విజయలక్ష్మి, తహసీల్దార్ ఇక్బాల్, డీటీఓ శివాజీ సందర్శించారు. ఆనాటి కట్టాడాలు, నిర్మాణాల్ని వారు పరిశీలించారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా అభివృద్ధి పనులపై కసరత్తు చేశారు. చేయాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు బైరబోయిన ఉమ, వేల్పుగొండ సువర్ణ, టార్చ్ కార్యదర్శి అరవింద్ ఆర్య, గైడ్ రవియాదవ్, కాంగ్రెస్ నేతలు బోగి సురేశ్, బైరబోయిన దామోదర్ పాల్గొన్నారు.


