ప్రజాస్వామ్యంపై అవగాహన అవసరం
సంగెం: విద్యార్థి దశలోనే ప్రజాస్వామ్యంపై అవహన పెంచుకోవడం అభినందనీయమని జీసీడీఓ ఫ్లోరెన్స్ అన్నారు. శుక్రవారం గవిచర్ల మోడల్ స్కూల్‌లో జిల్లాలోని 16 పీఎంశ్రీ స్కూళ్ల మాక్ పార్లమెంట్ నిర్వహించారు. అనంతరం జిల్లాస్థాయి క్విజ్, స్పెల్ బీ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యేలుగా వ్యవహరించి ప్రతిభ చాటారు. క్విజ్‌లో టీజీఆర్‌ఎస్ నెక్కొండ గర్ల్స్ జేసీ (ప్రథమ), మాక్ పార్లమెంట్‌లో జడ్పీహెచ్‌ఎస్ నర్సంపేట, స్పెల్‌బీలో టీజీఎంఎస్ గవిచర్ల బి.తరుణిమ, టీజీఎస్‌డబ్ల్యూ గర్ల్స్ జేసీ బి.సహస్ర రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. కార్యక్రమంలో ఏఎంఓ సుజన్‌తేజ, ప్రిన్సిపాల్ ఎస్పీ ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


