ఘనంగా ఐఎంఏ ప్రమాణ స్వీకారం
ఎంజీఎం: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 2025–26 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. వరంగల్ నగరంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్, యాక్షన్ కమిటీ చైర్మన్ రవీందర్‌రెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా నూతన అధ్యక్షుడు డాక్టర్ మన్మోహన్‌రాజు, ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి నుంచి అధ్యక్ష మెడల్‌ను స్వీకరించారు. అనంతరం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న శిరీష్‌కుమార్, ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, రంజిత్‌కుమార్, కూరపాటి రాధిక, జాయింట్ సెక్రటరీలు షఫీ, ప్రసన్నకుమార్, దిడ్డి స్వప్నలత, ఆర్థిక కార్యదర్శి వేములపల్లి నరేశ్‌తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, సెంట్రల్ కౌన్సిల్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డాక్టర్ కాళీ ప్రసాద్, శేషుమాధవ్, కస్తూరి ప్రమీల, డీఎంహెచ్‌ఓ అప్పయ్య, డాక్టర్ సుధీర్, విజయ్‌చందర్‌రెడ్డి, బందెల మోహన్‌రావు హాజరయ్యారు.


