జాతీయస్థాయి సదస్సుకు ఎంపిక
కాళోజీ సెంటర్: వరంగల్ నగరం కరీమాబాద్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పోగు అశోక్ 14వ జాతీయస్థాయి సదస్సుకు ఎంపికయ్యారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం జాతీయ స్థాయిలో విద్యాసదస్సు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ‘ఎన్‌హ్యాన్సింగ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఇన్ సెకండరీ స్కూల్ స్టూడెంట్స్’ అనే అంశంపై ఉ పాధ్యాయుడు అశోక్ సమర్పించిన పరిశోధన పత్రం జాతీయ సదస్సుకు ఎంపికై ంది. ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు రాజస్తాన్ అజ్మీర్‌లోని రీజి నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో జరగనున్న సదస్సులో ఆయన పా ల్గొననున్నారు. ఈ మేరకు ఆయనను పలువురు అభినందించారు.
మార్చి 14 నుంచి
టెన్త్ వార్షిక పరీక్షలు
కాళోజీ సెంటర్: పదో తరగతి వార్షిక పరీక్షలు 2026 మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ పీవీ శ్రీహరి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.
జాతీయస్థాయి సదస్సుకు ఎంపిక


