ఎఫ్‌ఏసీ డీఈఓగా గిరిరాజ్‌గౌడ్
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా ఫుల్ అడిషనల్ చార్జ్ (ఎఫ్‌ఏసీ) విద్యాశాఖ అధికారిగా ఎల్‌వి.గిరిరాజ్‌గౌడ్ నియమితులయ్యారు. ఈమేరకు తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గిరిరాజ్‌గౌడ్ సూర్యాపేట డీఈఓ కార్యాలయంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా, రాష్ట్ర విద్యాశాఖ డీఈఓ నియామకంలో జాప్యం చేస్తోందని కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం అదనపు కలెక్టర్ రెవెన్యూ అండ్ డీఆర్‌ఓ (ఎఫ్‌ఏసీ) వైవీ.గణేశ్‌కు ఇన్‌చార్జ్ డీఈఓగా బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంఈఓలు, ఉపాధ్యాయ సంఘాలకు సమాచారం అందింది. సామాజిక మాధ్యమాల్లోనూ వచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికే ఎఫ్‌ఏసీ డీఈఓగా గిరిరాజ్‌గౌడ్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఎంజీఎం: జిల్లాలోని వైద్యాధికారులు ప్రతీ వారం అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమలు తీరును సమీక్షించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులు, నగరంలోని యూపీహెచ్‌సీ, పీహెచ్‌సీల వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. ముక్త్ భారత్ అభియాన్, మాతా శిశు సంక్షేమం, ఎన్‌సీడీ, ఇమ్యూనైజేషన్ కార్యక్రమాల లక్ష్యాలను, సాధించిన ప్రగతిని ఏఎన్‌ఎంల వారీగా సమీక్షించారు. సమావేశంలో అడిషనల్ డీఎంహెచ్‌ఓ టి.మదన్మోహన్‌రావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రదీప్‌రెడ్డి, ప్రోగ్రాం అధికారులు ప్రభుదాస్, జ్ఞానేశ్వర్, శ్రీనివాస్, రుబీనా, తదితరులు పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా కేంద్రంలోని డీజీటీబీఎస్‌ఓలో మేనేజర్‌గా పని చేస్తున్న జె.పద్మావతిని సూపరింటెండెంట్ (టెంపరరీ)గా అదనపు బాధ్యతలు నిర్వర్తించేందుకు డిప్యూట్ చేస్తూ బుధవారం వరంగల్ పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. డీఈఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జీఎస్ ప్రసాద్‌రావు ఆరునెలలపాటు సెలవుపై వెళ్లారు. దీంతో ఆయన స్థానంలో బాధ్యతలు నిర్వర్తించేందుకు టెంపరరీగా పద్మావతికి బాధ్యతలు అప్పగించారు.
శ్రీవాణి డీఈఓ ఆఫీస్‌కు..
హనుమకొండలోని ప్రభుత్వ హైస్కూల్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీవాణిని టెంపరరీగా హనుమకొండలోని డీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ విధులను నిర్వర్తించేందుకు డిప్యూట్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమెను సీనియర్ అసిస్టెంట్ విధు ల నుంచి రిలీవ్ చేయాలని సంబంధిత ప్రభు త్వ హైస్కూల్ హెడ్మాస్టర్‌ను ఆదేశించారు.
వరంగల్ లీగల్: మానవ హక్కుల పరిరక్షణ మనందరి బాధ్యత అని హనుమకొండ జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి బి.అపర్ణాదేవి అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా కోర్టులో మానవ హక్కులపై అవగాహన సదస్సును న్యాయమూర్తి బి.అపర్ణదేవి ప్రారంభించారు. వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయ సేవాధికార సంస్థలు, హ్యూమన్ రైట్స్ అడ్వకేసి అడ్వైసరీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సదస్సులో ఆమె మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతీ మనిషికి హక్కులు, స్వేచ్ఛ, న్యాయం చేరేలా కృషి చేయాలని కోరారు. న్యాయవ్యవస్థలో పనిచేసే ప్రతి ఒక్కరూ మానవ హక్కుల పరిరక్షకులేనని తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తి క్షమాదేశ్ పాండే, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయమూర్తులు, వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు వలుస సుధీర్, బార్ కౌన్సిల్ మెంబర్ భైరపాక జయాకర్, హ్యూమన్ రైట్స్ అడ్వకేసి అడ్వైజరీ సత్య, కొంగర అనిల్‌కుమార్, ఇతర న్యాయవాదులు పాల్గొన్నారు.
ఎఫ్‌ఏసీ డీఈఓగా గిరిరాజ్‌గౌడ్
ఎఫ్‌ఏసీ డీఈఓగా గిరిరాజ్‌గౌడ్


