టెట్ నుంచి మినహాయించాలి
విద్యారణ్యపురి: ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాత్ సురేశ్ డిమాండ్ చేశారు. బుధవారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం హనుమకొండ, వరంగల్ జిల్లాల సర్వసభ్య సమావేశం హనుమకొండలోని సామజగన్మోహన్ స్మారక భవన్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సురేశ్ మాట్లాడుతూ.. టెట్ మినహాయింపుపై ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ, ఎన్‌సీటీఈ చైర్మన్, కేంద్రంలోని విద్యాశాఖ ఉన్నతాఽధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వరంగల్ టీపీయూఎస్ అధ్యక్షుడు బత్తిని వెంకటరమణగౌడ్, టీపీయూఎస్ రాష్ట్ర నాయకులు చిదురాల సుధాకర్, పిన్నింటి బాలాజీరావు, దాస్యం రామానుజస్వామి, ఆముదాల దాత మహర్షి, రెండు జిల్లాల్లోని వివిధ మండలాల అధ్యక్ష, కార్యదర్శులు టీపీయూఎస్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రెండు జిల్లాల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఎన్నికల అఽధికారిగా అయిల్నేని నరేందర్‌రావు, కె.వెంకటకృష్ణ పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉప్పుల సతీశ్, ప్రధాన కార్యదర్శిగా ఎ.శేఖర్ ఎన్నికయ్యారు. హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా బత్తిని వీరస్వామి, ప్రధాన కార్యదర్శిగా ప్రతాప్‌గిరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. వీరిచే ఎన్నికల అధికారులు ప్రమాణం స్వీకారం చేయించారు.
టీపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నవాత్ సురేశ్


