మరో మెగా రైల్వే ప్రాజెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మరో మెగా రైల్వే ప్రాజెక్ట్‌

Dec 11 2025 10:08 AM | Updated on Dec 11 2025 10:08 AM

మరో మెగా రైల్వే ప్రాజెక్ట్‌

మరో మెగా రైల్వే ప్రాజెక్ట్‌

మరో మెగా రైల్వే ప్రాజెక్ట్‌ గూడ్స్‌ వ్యాగన్‌ లైఫ్‌ టైం ఇలా..

● ఒక రైలు ఇంజన్‌ సుమారు రూ.3 కోట్లు విలువ ఉంటుంది. దాని జీవిత కాలం సుమారు 16ఏళ్లు, ఆరు నెలలకోసారి ఇంజన్‌ పీఓహెచ్‌కు వెళ్తుంది.

● ఒక వ్యాగన్‌ సుమారు రూ.60 లక్షలు, జీవిత కాలం 35ఏళ్లు, వ్యాగన్ల రకాల దృష్ట్యా 4 లేదా 6 ఏళ్లకు ఒకసారి పీఓహెచ్‌కు వెళ్తుంది.

● ఆర్వోహెచ్‌ అంటే–రొటీన్‌ ఓవర్‌హాలింగ్‌. వ్యా గన్‌ 18 నెలలకోసారి ఆర్వోహెచ్‌కు వెళ్తుంది.

● పీఓహెచ్‌ అంటే.. పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌.

● సిక్‌లైన్‌ అంటే వ్యాగన్ల రిపేర్‌

● యార్డు ఎగ్జామినేషనల్‌ లైన్‌ అంటే–గూడ్స్‌ వ్యాగన్‌ల ఫార్మేషన్‌ చెకింగ్‌ పాయింట్‌.

● రామగుండం, బెల్లంపల్లి, సనత్‌నగర్‌లో ఆర్వోహెచ్‌ డిపోలు ఉన్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో వ్యాగన్ల రిపేర్‌ కోసం రాయన్‌పాడ్‌ వర్క్‌షాప్‌, తిరుపతి సీఆర్‌ఎస్‌ వర్క్‌షాప్‌, కర్ణాటక యద్గిరి వర్క్‌షాప్‌లు అందుబాటులో ఉన్నాయి.

కాజీపేట రూరల్‌ : కాజీపేట జంక్షన్‌ సమీపంలో నష్కల్‌–ఘన్‌పూర్‌ మధ్య రైల్వేశాఖ రూ.908 కోట్లతో 300 ఎకరాల్లో మెగా రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాప్‌ (మెగా ఫ్రైట్‌ పీఓహెచ్‌ వ్యాగన్‌ వర్క్‌షాప్‌, డిపో) నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. కాజీపేటకు మూడేళ్ల క్రితం రైల్వే వ్యాగన్‌ పీఓహెచ్‌ షెడ్‌ మంజూరైంది. అనివార్య కారణాల వల్ల నిర్మాణ ప్రతిపాదనలు ముందుకు సాగలేదు. ఇప్పటికే కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ నిర్మాణం స్పీడ్‌గా జరుగుతుండగా, 2026 మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రా రంభించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. రైల్వే దినాదినాభివృద్ధిలో భాగంగా రైళ్ల రద్దీ, గూడ్స్‌ వ్యా గన్లు, ప్యాసింజర్స్‌ ట్రాఫిక్‌ను అధిగమించేందుకు, రవాణా, పాలనా సౌలభ్యం, ఎకానమీ, టైంను దృష్టిలో ఉంచుకుని అన్నీ ఒకేచోట ఉండేలా భావించిన రైల్వేశాఖ మెగా రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాప్‌ డిపో ను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు అధికారులు ప్రకటించారు. వ్యాగన్‌ ఆర్వోహెచ్‌, వ్యాగన్‌ పీఓ హెచ్‌, సిక్‌లైన్‌, యార్డు ఎగ్జామినేషన్‌ లైన్లను కలిపి ఒకే చోట ఉండేలా ఈ మెగా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. కాజీపేట ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌, డీజిల్‌ లోకోషెడ్‌ను భవిష్యత్‌లో అక్కడికే తరలించి అన్ని ఒకేచోట ఉండేలా అధికారులు డిజైన్‌ చేస్తున్నారు. ఉత్తర, దక్షిణ దేశ ప్రాంతాలకు గేట్‌ వేగా ఉంటున్న కాజీపేట జంక్షన్‌ను మరింత అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఈ మెగా పీఓహెచ్‌ షెడ్‌ నిర్మాణం ఉండనుంది.

ఆ రెండు చోట్ల అనుకున్నా..

ఒక దశలో మహబూబాబాద్‌, డోర్నకల్‌–కొత్తగూడెం మధ్య పోచారంలో ఈ మెగా రైల్వే ప్రాజెక్ట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వచ్చింది. రైల్వేశాఖ మాత్రం అన్నింటికీ అనువుగా ఉండేలా, ట్రాక్‌ కనెక్ట్టివిటీ, అధికారుల పర్యవేక్షణ, రోడ్డు రవాణా, ఆపరేటింగ్‌ మూవ్‌మెంట్‌ను దృష్టిలో ఉంచుకుని 90 శాతం వరకు నష్కల్‌–ఘన్‌పూర్‌ మధ్య ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ఫైనల్‌ చేసినట్లు చెబుతున్నారు. ప్రతి పాదనలు, సర్వేచేసిన నివేదికను రైల్వే బోర్డుకు పంపించనున్నట్లు తెలుస్తోంది. రైల్వే బోర్డు అన్నింటినీ పరిశీలించి ఆమోదం తెలిపి టెండర్‌ ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభమవుతాయని రైల్వే అధికారులు తెలుపుతున్నారు. కాగా, రైల్వే బోర్డునుంచి ఆమోదం ఆలస్యమైతే ప్రాజెక్ట్‌కు మంజూరైన రూ.908 కోట్లు వృథా అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

కాజీపేట–ఘన్‌పూర్‌ మధ్య నిర్మాణానికి రైల్వేశాఖ శ్రీకారం

ఆర్వోహెచ్‌, పీఓహెచ్‌, సిక్‌లైన్‌, యార్డు ఎగ్జామినేషన్‌ లైన్లను కలిపి ఒకేచోట

రైల్వే మెగా వ్యాగన్‌ వర్క్‌షాప్‌

డిపోనకు డిజైన్‌

రూ.908 కోట్లు.. 300 ఎకరాల్లో నిర్మాణానికి ప్రతిపాదనలు

భూమి సర్వే చేసిన అధికారులు..

మహబూబాబాద్‌, డోర్నకల్‌లో

సెక్షన్‌లోనూ డిమాండ్‌

చివరికి నష్కల్‌–ఘన్‌పూర్‌ మధ్య ఫైనల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement