ఓటు హక్కును వినియోగించుకోవాలి
వర్ధన్నపేట: ప్రజాస్వామ్యంలో ప్రతిఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని జెడ్పీ సీఈఓ, డీఆర్‌డీఏ పీడీ రాంరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఇల్లంద గ్రామంలో వర్ధన్నపేట తహసీల్దార్ విజయసాగర్, ఎంపీడీఓ వెంకటరమణ, ఎస్సై సాయిబాబు ఏపీఎం నాగేశ్వర్‌లతో కలిసి మహిళా సంఘాల స భ్యులు, గ్రామస్తులు గ్రామంలో ఓటరు చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా రాంరె డ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభా లకు లొంగకుండా సరైన నాయకుడిని ఎన్నుకుని గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించాలన్నారు. ఎన్నికల్లో అందరు నియమ నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు.
పోలీసుల ఫ్లాగ్ మార్చ్
రాయపర్తి: ఎన్నికల నియమావళిని పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య అన్నారు. మంగళవారం రాయపర్తి మండల కేంద్రంలో పోలీసు సిబ్బందితో కలిసి ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై ముత్యం రాజేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
యూరియా కోసం బారులు
ఖానాపురం: యూరియా కోసం రైతులకు ఇబ్బందులు తప్పడంలేదు.. చలిలోనూ యూరి యా కోసం తెల్లవారుజామునే బారులు తీరుతున్నారు. మండలంలోని ధర్మరావుపేట, అశోక్‌నగర్, దబ్బీర్‌పేట, రాగంపేట గ్రామాల్లో రైతులు బారులుతీరారు. ఆయా గ్రామాల పరిధిలో 1,332 బస్తాలను అందజేశారు. బస్తాలు లభించని రైతులు వెనుదిరిగారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై రఘుపతి ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు.
పేదల ఇంటి నిర్మాణానికి సాయం
గీసుకొండ: మండలంలో స్థలం ఉండి నిలువ నీడ లేని పేదల ఇంటి నిర్మాణానికి తనవంతుగా ఆర్థిక సాయాన్ని అందిస్తానని సామాజిక సేవకుడు అల్లం బాలకిశోర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలో ఎంతో మంది నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్నారని, వారి పరిస్థితిని చూసి ఆవేదన చెందానన్నారు. స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు దశల వారీ గా అల్లం బాలకిషోర్‌రెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.3లక్షల ఆర్థిక సాయం అందిస్తానన్నారు. దీంతో ఆయన చేసిన ప్రకటనపై మండలంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఓటు హక్కును వినియోగించుకోవాలి
ఓటు హక్కును వినియోగించుకోవాలి
ఓటు హక్కును వినియోగించుకోవాలి


