ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి
● జిల్లా ఎన్నికల అధికారి,
కలెక్టర్ సత్యశారద
సంగెం/పర్వతగిరి/గీసుకొండ: ఎన్నికల విధులు స మర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అ ధికారి, కలెక్టర్ సత్యశారద అన్నారు. మంగళవారం సంగెం, పర్వతగిరి, గీసుకొండ మండలకేంద్రాల్లో జరిగిన ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ తరగతులను సందర్శించి పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎ న్నికల ప్రక్రియలో పీఓలు క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు ప్రిసైడింగ్ అధికారులు సమయానికి హాజరు కావాలన్నారు. పోలింగ్ నిర్వహణ, కౌంటింగ్, ఉప సర్పంచ్ ఎన్నికల ధృవపత్రాల జారీ వంటి కార్యక్రమాలు అన్ని స్టేజ్ 2 రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణల ప్రిసైడింగ్ అధికారులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, జిల్లా సంక్షేమశాఖ అధికారి రమేష్, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీఓ రవీందర్, మాస్టర్ ట్రైనర్ నాగరాజు, పీఓలు పాల్గొన్నారు. అనంతరం మండలకేంద్రంలోని మనగ్రోమోర్ కేంద్రంలో యూరియా పంపిణీని పరిశీలించారు. యాసంగి పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. విత్తనాలు, ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాజ్‌కుమార్, ఏఓ జగదీశ్వర్ పాల్గొన్నారు.
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి
న్యూశాయంపేట: గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి మొదటి దశ ఎన్నికల నిర్వహణపై జిల్లాల కలెక్టర్‌లు, ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత ఎన్నికలు పర్వతగిరి, రాయపర్తి, వర్ధన్నపేట మండలాల్లో 731 పోలింగ్ స్టేషన్లలో 80 పంచాయతీల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈవీసీలో డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారా ణి, సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కల్పన, ఆర్డీఓలు సుమ, ఉమారాణిలు పాల్గొన్నారు.
ఎన్నికల సంఘం మార్గదర్శకాలు
పాటించాలి
జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జ రిగేందుకు ప్రతిఒక్కరూ ఎన్నికల సంఘం మా ర్గదర్శకాలు పాటించాలని కలెక్టర్ సత్యశారద మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జీపీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ప్రచా రానికి తెరపడిందన్నారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు ఆయా మండలాల్లో సై లెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందన్నారు. పో లింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. ఎన్ని కల సంఘం ఆదేశాల మేరకు తగుచర్యలు తీసుకోవాలని నోడల్ అధికారులను ఆదేశించారు.


