పద్మశాలీలు రాజకీయ శక్తిగా ఎదగాలి
ఖిలా వరంగల్: పద్మశాలీల ఆడబిడ్డా.. మీకు పెద్ద దిక్కుగా ఉంటానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ హామీ ఇచ్చారు. పద్మశాలీలు ఐక్యత చాటుతూ పార్టీలకు అతీతంగా సంఘటితమై సామాజిక, ఆర్థిక, రాజకీయ శక్తి ఎదగాలని ఆమె సూచించారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్‌కోటలోని క్రీడామైదానంలో వరంగల్ జిల్లా, పట్టణ పద్మశాలి ప్రతినిధుల ఆధ్వర్యంలో పద్మశాలీల కార్తీక వనభోజన మహోత్సవం ఆదివారం కనుల పండువగా జరిగింది. ముఖ్యఅతిథులుగా మంత్రి కొండా సురేఖ, మేయర్ గుండు సుధారాణి, నాయకులు గుండు ప్రభాకర్, ఈగ మల్లేశం, సాంబారి సమ్మారావు హాజరై మాట్లాడారు. పద్మశాలీల అభ్యున్నతే లక్ష్యంగా సంఘాలు పనిచేయాలని, సమష్టిగా ఉంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. పద్మశాలీలు ఏడాదిపాటు సుఖసంతోషాలతో ఉండేందుకే వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం పద్మశాలీలు సామూహిక భోజనాలు చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్, ప్రతినిధులు శామంతుల శ్రీనివాస్, వడ్నాల నరేందర్, కుసుమ సతీష్‌బాబు, గోరంటల రాజు, బైరి శ్యాం, డీఎస్ మూర్తి, బేతి అశోక్‌బాబు, చిప్ప వెంకటేశ్వర్లు, ఆడెపు వెంకటేశ్, బైరి మురళి కృష్ణ, తుమ్మ రమేశ్, కుమారస్వామి, రాజేందర్, క్రాంతికుమార్, సమ్మయ్య, బాసాని శ్రీనివాస్, మేరుగు అశోక్, గడ్డం రవి, కామేశ్వర్‌రావు, సుధాకర్, చందర్‌బాబు, కూచన క్రాంతి కుమార్, అకెన వెంకటేశ్వర్లు, బొమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర అటవీ, పర్యావరణ,
దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ
కోటలో ఘనంగా పద్మశాలీల
వనభోజన మహోత్సవం


