అఖిల భారత సహకార వారోత్సవాలు
ఎల్కతుర్తి: అఖిల భారత సహకార వారోత్సవాల సందర్భంగా ఆదివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం ప్రధాన కార్యాలయంలో సహకార వారోత్సవాల ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇందులో సహకార రంగం ప్రాధాన్యం, ఆవిష్కరణలపై రైతులకు అవగాహన కల్పించారు. సహకార రంగం ద్వారా గ్రామీణ అభివృద్ధిని బలోపేతం చేయడం, ప్రపంచ పోటీ శక్తికి అనుగుణంగా సహకార వ్యాపార నమూనాల్లో ఆవిష్కరణల ప్రాముఖ్యం అంశాలపై వివిధ వక్తలు ప్రసంగించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సహకార వ్యవస్థ వెన్నెముకలా నిలస్తోందని, ఈ సంస్థలు ప్రజల ఆర్థిక సర్వ సామర్యానికి, సామూహిక అభివృద్ధికి దోహదం చేస్తున్నాయని పేర్కొన్నారు. కాగా.. సహకార శిక్షణ కేంద్రం వరంగల్ ప్రిన్సిపాల్ ఎల్.యాకూబ్, అసిస్టెంట్ రిజిస్టర్, లెక్చరర్ నారాయణ, హనుమకొండ డీసీఓ సీనియర్ ఇన్‌స్పెక్టర్ అఫ్జల్, తదితరులు సహకార రంగ అభివృద్ధి, ఆవిష్కరణల అవసరాన్ని వివరించారు. సంఘం జనరల్ మేనేజర్ రాంరెడ్డి, కార్యవర్గ సభ్యులు, హడక్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ముల్కనూరు సహకార సంస్థ
కార్యాలయంలో సదస్సులు


