కుక్కపిల్లలంటే ఆమెకు ప్రాణం
మానుకోట మున్సిపాలిటీ పరిధి ఈదులపూసలపల్లికి చెందిన మ్యారేజ్ ఈవెంట్స్ ఆర్గనైజర్ పింగిలి దీపికకు కుక్కపిల్లలంటే ప్రాణం. దీపిక బాల్యంలో ఆమె నాన్న చిన్న కుక్క పిల్లను ఇంటికి తీసుకొచ్చాడు. ఆ కుక్కపిల్లను ఆమె అల్లారుముద్దుగా చూసుకునేవారు. అప్పటి నుంచే ఆమెకు కుక్కపిల్లలపై ప్రేమ పెరిగింది. కుక్కలకు సొంత డబ్బుతో వైద్యం, నాన్న పెన్షన్ డబ్బులతో స్నాక్స్, భోజనం అందిస్తున్నారు. ఆమె పెంచుతున్న వీధి కుక్కల్లో చాలావరకు గుండె, లివర్, క్యాన్సర్, ఫిట్స్ వంటి రోగాల బారిన పడి ఉన్నాయి. వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి కారులో తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆమె 3 వేల కుక్కలను దత్తత ఇచ్చారు. అదేవిధంగా ఆమె ఇంటి వద్ద ప్రస్తుతం 36 కుక్కలు ఉన్నాయి. అంతేకాకుండా ప్రత్యేకంగా కుక్కల కోసం యూట్యూబ్ చానల్ ప్రారంభించారు. కుక్కలను ఎవరైనా దత్తత తీసుకోవాలంటే 73962 82837 నంబర్‌లో సంప్రదించాలని దీపిక కోరుతున్నారు.


