ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
నల్లబెల్లి: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మండలంలోని గోవిందాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం కలెక్టర్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యాన్ని కాపాడుకునేందుకు టార్పాలిన్ కవర్లను వినియోగించుకోవాలని సూచించారు. ధాన్యాన్ని తొందరగా తూకం వేసి రైస్ మిల్లులకు తరలించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, కొనుగోలు కేంద్రాల్లో సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, డీఎస్‌ఓ కిష్టయ్య, జిల్లా సివిల్ సప్లయీస్ మేనేజర్ సంధ్యారాణి, ఏపీడీ నిర్మల, తహసీల్దార్ ముప్పు కృష్ణ, ఎంపీడీఓ శుభానివాస్, ఏఓ రజిత, సివిల్ సప్లయీస్ డీటీ సంధ్యారాణి, డీపీఎం దాసు, ఏపీఎం సుధాకర్ ఉన్నారు.
ఫారంపాండ్‌లు నిర్మించుకోవాలి
దుగ్గొండి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు తమ పంట పొలాల్లో ఫారంపాండ్‌లు నిర్మించుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. జలశక్తి అభియాన్ కార్యక్రమంలో జిల్లాకు వచ్చిన కోటి రూపాయల నగదు బహుమతి వచ్చింది. ఈ మేరకు జలశక్తి అభియాన్ కింద తొగర్రాయి గ్రామంలో రైతు బండారి రవి నిర్మించిన ఫారంపాండ్‌ను ఆమె శనివారం పరిశీలించారు. ఫారంపాండ్‌తో కలిగే లాభాలను రైతును అడిగి తెలుసుకుని అభినందించారు. వ్యవసాయ భూమి కింది భాగంలో ఫారంపాండ్ నిర్మించుకుంటే వర్షపు నీరంతా చేరిందని రైతు రవి తెలిపారు. పంటకు అవసరమైనప్పుడు మోటారు ద్వారా నీటిని అందించినట్లు పేర్కొన్నారు. దీంతోపాటు తన ఇంటి అవసరాల నిమిత్తం చేప పిల్లలు కూడా పెంచుకున్నట్లు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈజీఎస్‌లో ఫారంపాండ్‌ల నిర్మాణాన్ని విరివిగా చేపట్టాలన్నారు. డీఆర్‌డీఏ ఏపీడీ శ్రీవాణి, ఎంపీడీఓ అరుంధతి, ఎంపీఓ శ్రీనివాస్, ఈసీ రాజు, క్లస్టర్ టీఏలు సుధాకర్, సురేశ్, భద్రు, పంచాయతీ కార్యదర్శి వాణి, ఫీల్డ్ అసిస్టెంట్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


