పక్షులకు ఆవాసం.. ప్రకృతితో సహవాసం
హనుమకొండ ప్రకాశ్‌రెడ్డి పేటకు చెందిన ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల ఓనర్స్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు గాదె స్వరూప్‌రెడ్డికి పక్షులంటే అమితమైన ప్రేమ. ఇంటి ఆవరణలో ప్రత్యేక షెడ్డు వేసి పక్షులను పెంచుతున్నారు. అంతేకాకుండా నిత్యం పిచ్చుకలు, రామ చిలుకలు, పలు జాతులకు చెందిన పక్షులు ఇక్కడికి వచ్చి ఆహారం తిని వెళ్తుంటాయి. వాటి కోసం డబ్బాలను ఏర్పాటు చేసి ధాన్యం గింజలు పోస్తున్నారు. ధాన్యపు గుత్తులు వేలాడదీస్తున్నారు. గిన్నెల్లో నీళ్లు పోసి వాటి దప్పిక తీరుస్తున్నారు. కొంత సమయం పక్షుల మధ్య గడిపితే ఆ రోజంతా మనసు ఉల్లాసంగా ఉంటుందని స్వరూప్‌రెడ్డి చెబుతున్నారు.


