వినియోగదారులకు నాణ్యమైన సేవలు | - | Sakshi
Sakshi News home page

వినియోగదారులకు నాణ్యమైన సేవలు

Nov 16 2025 7:09 AM | Updated on Nov 16 2025 7:09 AM

వినియ

వినియోగదారులకు నాణ్యమైన సేవలు

హన్మకొండ: సాంకేతికతను వినియోగించి వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్‌ సేవలు అందిస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్‌ వరంగల్‌ సర్కిల్‌ సూపరింటెంటెండ్‌ ఇంజనీర్‌ కె.గౌతంరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారుల సౌకర్యార్థం 20 ఫీచర్లతో టీజీ ఎన్పీడీసీఎల్‌ యాప్‌ రూపొందించామని తెలిపారు. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ఫోన్‌లో, ప్లేస్టోర్‌ నుంచి ఐ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని సేవలు పొందొచ్చని సూచించారు. కొత్త సర్వీసుల మంజూరు సులభతరం చేశామని, మంజూరులో ఏమైనా చిన్న లోపాలు ఉంటే దరఖాస్తు తిరస్కరించకుండా వినియోగదారుడికి మరోసారి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. వాట్సాప్‌ చాట్‌ బాట్‌ ద్వారా సమస్యలు తెలపవచ్చన్నారు. ఇందులో మొదట వినియోగదారులు తమ మొబైల్‌ నుంచి వాట్సాప్‌లో 7901628348 నంబర్‌కు హాయ్‌ అని చాట్‌ చేయగానే హాయ్‌ టీజీ ఎన్పీడీసీఎల్‌ కాల్‌ సెంటర్‌కు స్వాగతం అని వస్తుందని వివరించారు. ఇలా ఏజెంట్‌తో చాట్‌ చేయవచ్చు లేదా కంప్లైంట్‌ నమోదు చేసుకోవచ్చని వివరించారు.

సొంతంగా విద్యుత్‌ పనులు చేయొద్దు : డీఈఈ

దుగ్గొండి: రైతులు విద్యుత్‌ సిబ్బందికి సమాచారం అందించకుండా సొంతంగా మరమ్మతు పనులు చేయొద్దని ట్రాన్స్‌కో డీఈఈ తిరుపతి అన్నారు. పొలం బాట కార్యక్రమంలో భాగంగా చలపర్తి గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద శనివారం రైతులకు అవగాహన కల్పించారు. విద్యుత్‌ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, నాణ్యమైన మోటారు, స్టార్టర్‌ వాడితే మరమ్మతుకు రాకుండా ఉంటాయన్నారు. ఏడీ లక్ష్మ ణ్‌నాయక్‌, ఏఈ ప్రత్యూష, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ అజీంపాషా, జేఎల్‌ఎం నాగరాజు, అజయ్‌, రైతులు దామోదర్‌రెడ్డి, సుధాకర్‌, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

చోరీలు చేస్తున్న కారు డ్రైవర్‌ అరెస్ట్‌

నెక్కొండ: చోరీలు చేస్తున్న కారు డ్రైవర్‌ను అరెస్టు చేసినట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌లో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని బొల్లికొండ గ్రామానికి చెందిన బానోత్‌ అజయ్‌కుమార్‌ కారు డ్రైవర్‌ పనిచేస్తూ తోపనపల్లి, బొల్లికొండ గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నాడని చెప్పారు. నిందితుడిని పట్టుకునేందుకు నిఘా ఏర్పాటు చేశామని, ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడని ఆయన పేర్కొన్నారు. అతడి నుంచి 20 తులాల వెండి, తులం బంగారం రికవరీ చేశామని తెలిపారు. అజయ్‌కుమార్‌పై గతంలో కూడా పలు కేసులు నమోదైనట్లు సమాచారం లభించిందని ఎస్సై పేర్కొన్నారు. రికవరీ అనంతరం నిందితుడిని రిమాండ్‌ చేసి మహబూబాబాద్‌ జైలుకి తరలించామని తెలిపారు.

మహాధర్నాను జయప్రదం చేయండి

కాళోజీ సెంటర్‌: పెండింగ్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 17న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద నిర్వహించతలపెట్టిన మహాధర్నాను జయప్రదం చేయాలని రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ బకాయిల సాధన సమితి రాష్ట్ర కోకన్వీనర్‌ శ్రీధర్ల ధర్మేంద్ర, ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్‌, అసోసియేట్‌ అధ్యక్షుడు కందుకూరి దేవదాస్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం వారు హనుమకొండలో మహాధర్నా కరపత్రం ఆవిష్కరించి మాట్లాడారు. బకాయిలు చెల్లించాలని గతంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రాలు అందించినా స్పందన రాలేదని పేర్కొన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మహా ధర్నా నిర్వహించనున్నుట్లు తెలిపారు. నాయకులు ఎండీ అబ్దుల్‌గఫార్‌, నాయకులు ఇంద్రసేనారెడ్డి, సంజీవ్‌రెడ్డి, సారయ్య, డాక్టర్‌ బి.కృష్ణమూర్తి పాల్గొన్నారు.

వినియోగదారులకు నాణ్యమైన సేవలు1
1/3

వినియోగదారులకు నాణ్యమైన సేవలు

వినియోగదారులకు నాణ్యమైన సేవలు2
2/3

వినియోగదారులకు నాణ్యమైన సేవలు

వినియోగదారులకు నాణ్యమైన సేవలు3
3/3

వినియోగదారులకు నాణ్యమైన సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement