డిజిటల్ విద్యను ఉపయోగించుకోవాలి
విద్యారణ్యపురి: విద్యార్థులు ఆధునిక సాంకేతికపై అవగాహన పెంచుకుని డిజిటల్ విద్యను ఉపయోగించుకోవాలని డీఈఓ రంగయ్యనాయుడు అన్నారు. మంగళవారం రాష్ట్ర గెజిటెడ్ హెచ్‌ఎంల అసోసియేషన్, టీసాట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల్లో సృజనాత్మకత ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు. ఈ సమావేశంలో గెజిటెడ్ హెచ్‌ఎంల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.రవీందర్, సుధాకర్‌రావు, సైన్స్ అధికారి శ్రీనివాస్, కృష్ణమూర్తి, హెచ్‌ఎంలు శ్రీనివాస్‌రావు, శారదాబాయి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందించారు. వ్యాసరచన పోటీల్లో చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి పాఠశాల విద్యార్థిని ద్రాక్షాయని, వక్తృత్వ పోటీల్లో బుధరావుపేట విద్యార్థి ఎండీ హాసన్‌లు ప్రథమ బహుమతి సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు నిర్వాహకులు తెలిపారు. వీరు ఈనెల 12, 13 తేదీల్లో హైదరాబాద్‌లో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారని తెలిపారు.
అభివృద్ధి పనులు
త్వరగా పూర్తి చేయండి
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనుల్ని త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ ఛాంబర్‌లో ఇంజనీరింగ్ అధికారులతో 15వ ఆర్థిక సంఘం పనుల పురోగతిని సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగర పరిధి 66 డివిజన్ల వ్యాప్తంగా 15వ ఆర్థిక సంఘం ద్వారా వివిధ రకాల అభివృద్ధి పనులైన సీసీ రోడ్లు, డ్రెయిన్‌లు, పైప్‌లైన్ పనులు, ఫిల్టర్ బెడ్లలో అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని పనులు పూర్తయ్యాయని, మరికొన్ని పురోగతి దశలో ఉన్నాయని ఇంజినీర్లు వెల్లడించారు. పురోగతిలో ఉన్న పనుల్ని వేగంగా పూర్తి చేసేలా చూడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సత్యనారాయణ ఈఈలు మహేందర్, మాధవీలత, డీఈలు రాజ్‌కుమార్, సారంగం, కార్తీక్‌రెడ్డి, రోజారాణి, రవికిరణ్, రంగారావు, సతీశ్ రాగి శ్రీకాంత్, ఏఈలు పాల్గొన్నారు.
నాగ సుబ్రహ్మణ్యుడికి ప్రత్యేక పూజలు
గీసుకొండ: మండలంలోని ఊకల్‌హవేలిలోని ప్రసిద్ధ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీక బహుళ షష్టిని పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక పూజలను నిర్వహించారు. కార్తీక మాసం సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి అత్యంత ప్రీతిపాత్రమైంది కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సముద్రాల సుదర్శనాచార్యులు స్వామివారి గర్భాలయాన్ని పల్లకి, ఉయాల రీతిలో పూలతో సుందరంగా అలంకరించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు శ్రీహర్ష తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత
అలవర్చుకోవాలి
నల్లబెల్లి: విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత అలవర్చుకోవాలని, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆరోగ్యంగా ఉంటేనే చదువులో రాణిస్తారని రాష్ట్రీయ బాల స్వస్థ్వ (ఆర్‌బీఎస్‌కే) మెడికల్ ఆఫీసర్లు భవిత, స్వర్ణలత అన్నారు. మంగళవారం మండలంలోని నాగరాజుపల్లి శివారు పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు ఆరోగ్య పరమైన సూచనలు చేశారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం కర్ణకంటి రామ్మూర్తి, ఉపాధ్యాయులు కూనమళ్ల రాజన్ బాబు, ఆర్‌బీఎస్‌కే ఫార్మసిస్టు స్మిత, ఏఎన్‌ఎం జులేఖ తదితరులు పాల్గొన్నారు.
డిజిటల్ విద్యను ఉపయోగించుకోవాలి


