
మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం
ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండించాలి..
పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రచురించినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే న్యాయం పోరాటం చేయాలి. బెదిరింపులకు పాల్పడుతూ కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛ హరించడమే. ఏపీ ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– ఆడెపు రవీందర్, అధ్యక్షుడు
దేశాయిపేట రోడ్డు వర్తక సంఘం, వరంగల్
వేధింపులు మానుకోవాలి..
నెహ్రూసెంటర్: వాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షి పత్రికపై, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం, పోలీసులు వేధింపులు మానుకోవాలి. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చెప్పినట్లు అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. సాక్షి పత్రికపై దాడులు, పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.
– గుగులోత్ భీమానాయక్,
ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం
కక్షసాధింపు సరికాదు
తక్షణమే కేసులను
ఉపసంహరించుకోవాలి
ప్రజాసంఘాల నాయకుల డిమాండ్

మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం

మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం