
విజయానికి చిహ్నమే దీపావళి
చెడుపై మంచి సాధించిన విజయంతో ప్రజలు దీపావళి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. నరకాసుర ప్రతిమను దహనం చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీకృష్ణుడు, సత్యభామతో కలిసి నరకాసురుడిని సంహరించిన రోజున ప్రజలందరు ఇంటింటా దీపాలు వెలిగించారని గుర్తుచేశారు. శ్రీరంగనాఽథుడి సన్నిధిలో రంగలీల మైదానంలో 100 ఏళ్లుగా దసరా ఉత్సవాలు, 20 ఏళ్లుగా నరకాసుర వధ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమన్నారు. ఉత్సవ కమిటీతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని తెలిపారు. అనంతరం నగర ప్రజలకు ఆమె దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు పల్లం పద్మ, పోశాల పద్మ, పలు శాఖల అధికారులు, భక్తులు పాల్గొన్నారు.