
వరంగల్
న్యూస్‌రీల్
గురువారం శ్రీ 16 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతు పేరు భూక్యా లక్ష్మి. చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామానికి చెందిన ఆమె తనకు ఉన్న రెండు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసింది. ఎకరాకు 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తదనుకుంటే భారీ వర్షాలతో 30 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. విక్రయించేందుకు నెక్కొండ వ్యవసాయ మార్కెట్‌కు మక్కలను తీసుకెళ్తే కుంటి సాకులు చెబుతూ క్వింటాలుకు రూ.1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర చెల్లించకపోవడంతో వ్యాపారులు, మార్కెట్ వర్గాలు కుమ్మకై ్క తక్కువ ధరకు పంటను కొనుగోలు చేస్తున్నారని లక్ష్మి వాపోతోంది. ఈ పరిస్థితి జిల్లాలో మొక్కజొన్న పంట సాగుచేసిన అనేక మంది రైతులు ఎదుర్కొంటున్నారు.

వరంగల్