
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
– 10లోu
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి దొంతి కాంతమ్మకు బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులర్పించారు. ప్రశాంత్ నగర్ సమీపంలోని పీజీఆర్ గార్డెన్‌లో మాత యజ్ఞం కార్యక్రమాన్ని నిర్వహించగా సీఎంతోపాటు మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ముందుగా కాంతమ్మ చిత్రపటం వద్ద పూలు చల్లి మాధవరెడ్డిని పరామర్శించారు. అంతకుముందు సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
– సాక్షిప్రతినిధి, వరంగల్
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు
గీసుకొండ: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి.సాంబశివరావు అసహనం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో పల్లెదవాఖాన వైద్యులు, సూపర్‌వైజర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లేని పిల్లలను గుర్తించి పీహెచ్‌సీలు, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలందించాలన్నారు. ప్రోగ్రాం అధికారులు అన్ని కార్యక్రమాలను పర్యవేక్షించి అనుకున్న ఫలితాలు రాబట్టాలన్నారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రకాశ్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రవీందర్, డాక్టర్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.