
గ్రీన్‌ఫీల్డ్ హైవేకు భూసేకరణ పూర్తిచేయాలి
న్యూశాయంపేట: జిల్లా నుంచి వెళ్లే గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేకు భూసేకరణ పూర్తిచేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో భూసేకరణపై కలెక్టర్ బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల, వరంగల్, ఖమ్మం జిల్లాలను కలుపుతూ నిర్మించనున్న ఎన్‌హెచ్–163జీకి 165.11 హెక్టార్ల భూసేకరణకు ఇప్పటివరకు 159.96 హెక్టర్ల భూసేకరణ పూర్తి అయిందన్నారు. కోర్టు కేసులతో పెండింగ్‌లో ఉన్న మిగిలిన 27.21 హెక్టార్ల భూసేకరణను ఈనెల 21లోగా పూర్తిచేయాలని, భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం త్వరితగతిన చెల్లించి ల్యాండ్ అక్విజేషన్ పూర్తిచేయాలని సూచించారు. సమీక్షలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, నర్సంపేట ఆర్డీఓ ఉమారాణి, నేషనల్ హైవే పీడీ దివ్య, ఏడీ సర్వేల్యాండ్స్ శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, గీసుకొండ, సంగెం, నెక్కొండ తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు
ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగేలా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణపై సమీక్షించారు. ఈసారి ఖరీఫ్‌లో 3,15 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు, కొనుకోళ్లకు 258 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాకు 120–0 అదనపు టార్పాలిన్లు కేటాయించాలని కోరారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు రూ. 2,389, సాధారణ రకానికి 2,369 చెల్లించనున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిషత్ సీఈఓ, ఇన్‌చార్జ్ డీఆర్డీఓ రాంరెడ్డి, జిల్లా పౌరసరఫరాల అధికారి కిష్టయ్య, మేనేజర్ సంధ్యారాణి, వ్యవసాయ అధికారి అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అధికారుల సమీక్షలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద