
పేదల కష్టాలు తీర్చేది కాంగ్రెస్సే
● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు
వర్ధన్నపేట: పేదల కష్టాలు తీర్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు స్పష్టం చేశారు. పట్టణ కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ విజయ్‌సాగర్ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. వర్ధన్నపేట, టౌన్, పర్వతగిరి మండలాల పరిధిలోని 155 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.1.55 కోట్లు, 67 మందికి రూ.21.62 లక్షల విలువగల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు రాష్ట్ర ఖజనాపై ప్రభావం చూపుతున్నా పేదల సంక్షేమాన్ని ఆపకుండా సీఎం రేవంత్‌రెడ్డి పథకాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. యూరియా విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్‌రావు, నాయకులు తుల్లా రవి, అబ్బిడి రాజిరెడ్డి, ఎద్దు సత్యనారాయణ, శ్రీనివాస్, సురేష్, భానుప్రసాద్, కృష్ణారెడ్డి, వెంకన్న, చోటు, యాదగిరి, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.