ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌కి మెమో | - | Sakshi
Sakshi News home page

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌కి మెమో

Sep 13 2025 2:29 AM | Updated on Sep 13 2025 2:29 AM

ఎంఎల్

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌కి మెమో

ముక్కిన బియ్యాన్ని గుర్తించిన కలెక్టర్‌

న్యూశాయంపేట: వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లోని మండల్‌ లెవల్‌ స్టాక్‌(బియ్యం) పాయింట్‌ను కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రంలోని నిల్వలు, బియ్యం నాణ్యత, నిల్వ విధానం, భద్రతా ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ముక్కిన బియ్యం, విద్యార్థులకు సరఫరా చేసే మధ్యాహ్న భోజన పథక బియ్యం ఒకే ప్రాంతంలో ఉండటాన్ని గమనించిన కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరసరఫరాల డీఎం, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌కి మెమో జారీచేయాలని అదనపు కలెక్టర్‌ను ఆదేశించారు. తనిఖీల్లో పట్టుబడిన బియ్యాన్ని వెంటనే వేలం వేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, వరంగల్‌ తహసీల్దార్‌ ఇక్బాల్‌, తదితర అధికారులు పాల్గొన్నారు.

నాటిన ప్రతీ మొక్కను

సంరక్షించాలి

గీసుకొండ: రోడ్లకు ఇరువైపులా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని డీఎఫ్‌ఓ అనుచ్‌ అగర్వాల్‌ అన్నారు. మండలంలోని మచ్చాపూర్‌ నుంచి దుగ్గొండి మండలం లక్ష్మీపురం వరకు ఆర్‌అండ్‌ బీ రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన మొక్కలను శుక్రవారం ఆయన పరిశీలించారు. నాటిన మొక్కలు చనిపోతే వాటి స్థానంలో కొత్తవి నాటాలని చెప్పారు. ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌ సృజనకుమారి, సెక్షన్‌ ఆఫీసర్‌ జగ్గయ్యనాయక్‌, బీట్‌ ఆఫీసర్‌ సమయనాయక్‌, వన సేవకులు రాజు, శ్రీకాంత్‌, యాకయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.

నిర్వాసితులతో

కలెక్టర్‌ సమీక్ష

న్యూశాయంపేట: మామునూర్‌ ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన గాడిపెల్లి గ్రామస్తులతో శుక్రవారం కలెక్టర్‌ సత్యశారద సమీక్షా సమావేశం నిర్వహించారు. 12 మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించే తీరుపై సమీక్షించారు. సమీక్షలో నిర్వాసితుల సందేహాలను నివృత్తి చేశారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఆర్‌డిఓ సత్యపాల్‌రెడ్డి, ఖిలావరంగల్‌ తహాశీల్‌దార్‌ శ్రీకాంత్‌, ఏఓ విశ్వప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలి

వరంగల్‌ లీగల్‌: జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లను వినియోగించుకోవాలని వరగల్‌, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార కార్యదర్శులు ఎం.సాయికుమార్‌, క్షమాదేశ్‌ పాండే ఒక ప్రకటనలో తెలిపారు. జాతీయ లోక్‌అదాలత్‌ను పురస్కరించుకొని వరంగల్‌, హనుమకొండతోపాటు ఆయా జిల్లాల పరిధిలోని నర్సంపేట, పరకాల కోర్టుల్లో సైతం బెంచీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కక్షిదారులు లోక్‌అదాలత్‌లకు హాజరై రాజీమార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని వారు సూచించారు.

బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా కోల్‌

తెలంగాణ సంప్రదాయ పండుగల్లో ఒకటైన బొడ్డెమ్మ వేడుకలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహిళలు, యువతులు, చిన్నారులంతా కలిసి పుట్టమన్ను తెచ్చి బొడ్డెమ్మ గద్దెను రూపొందించారు. పూలు, ఒడి బియ్యంతోపాటు నైవేద్యం తయారు చేసి ‘బొడ్డెమ్మ.. బొడ్డెమ్మా.. కోలు బిడ్డాలెందరూ..’ అంటూ పాటలు పాడుతూ.. ఆడారు. చిన్నారులు ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు. బొడ్డెమ్మ అనంతరం పెద్దల అమావాస్యతో బతుకమ్మ పండుగ మొదలుకానుంది.

– సాక్షి నెట్‌వర్క్‌

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌కి మెమో
1
1/2

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌కి మెమో

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌కి మెమో
2
2/2

ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జ్‌కి మెమో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement