
నియంతృత్వ పాలనకు నిదర్శనం..
మహబూబాబాద్ అర్బన్: ప్రజాస్వామ్య మౌలిక సూత్రమే భావ ప్రకటన స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛను కాలరాయడం నియతృత్వ పాలనకు నిదర్శనం. వాక్ స్వాతంత్య్రం నిరాకరించడం అంటే ప్రజస్వామ్యంలో నాలుగో స్తంభాన్ని కూలగొట్టడమే. ప్రభుత్వ కాలపరిమితి పరిమితం. కానీ, ప్రజాస్వామ్యం అజేయమైంది. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి మీడియా గొంతును నొక్కయడం సరికా దు. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం సరికాదు.
– డాక్టర్ డోలి సత్యనారాయణ, తెలంగాణ
ఉద్యమకారుడు, మానుకోట
ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే..
ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా పత్రికలు పనిచేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతికా స్వేచ్ఛను హరించడమంటే రాజ్యాంగ సూత్రాలను దెబ్బతీయడమే. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. ప్రతిక స్వేచ్ఛను కాపాడకుంటే ప్రజలు బుద్ధిచెబుతారు.
– పిల్లి సుధాకర్, మాలమహానాడు
తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు

నియంతృత్వ పాలనకు నిదర్శనం..