
ప్రజల గొంతు నొక్కడమే..
హన్మకొండ అర్బన్: ప్రతిపక్షాల గొంతు నొక్కడం తెలుగు రాష్ట్రాల్లో ఆనవాయితీగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉన్న ఏకై క గొంతుక పత్రికలు. వాటిని కూడా అణచివేయడం, అక్రమ కేసులతో తొక్కివేయడం వంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో దురదృష్టకర పరిణామాలుగా చెప్పాలి. ఏపీలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. పత్రికలే ప్రజల గొంతుకగా ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పత్రికలు, పత్రికా స్వేచ్ఛ, జర్నలిస్టులను కేసుల పేరుతో నిర్బంధించడం. వేధించడం అమానుషం. ఇది మంచి పరిణామం కాదు. రానున్న రోజుల్లో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న ప్రభుత్వాలు, నాయకులు ప్రజాగ్రహానికి గురవ్వక తప్పదు.
– ఎన్నమనేని జగన్మోహన్‌రావు,
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
ప్రజల స్వేచ్ఛను హరించడమే..
హన్మకొండ అర్బన్: అధికార పక్షం విఫలమైనప్పుడు ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా నిలబడేవి పత్రికలు, మీడియా మాత్రమే. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు అధికారంలోకి వస్తే వారు తమ స్వలాభం కోసం నిర్బంధాలు విధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అది పూర్తిగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్లే, కక్ష సాధించినట్లే. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. అధికారంలో ఎవరున్నా పత్రికా స్వేచ్ఛను కాలరాయడమన్నది ప్రజల స్వేచ్ఛను హరించడమే. ఇప్పటికై నా ప్రభుత్వాలు ఉద్దేశపూర్వక చర్యలను మానుకోవాలి. సాక్షి జర్నలిస్టులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – నిమ్మల శ్రీనివాస్, సామాజికవేత్త

ప్రజల గొంతు నొక్కడమే..