
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేకి..
● మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
ఖానాపురం: రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్న కాంగ్రెస్ రైతు వ్యతిరేకి అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని గొల్లగూడెంతండాకు చెందిన రైతు తేజావత్ శ్రీనుకు చెందిన మొక్కజొన్నకు యూరియా లభించకపోవడంతో గొర్రెలు మేయడంతో శుక్రవారం సుదర్శన్‌రెడ్డి పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. డీఏఓ అనురాధతో మాట్లాడి ఏఓ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయాలని తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూరియా కోసం బారులుదీరుతున్న రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నష్టపోయిన ప్రతీ రైతుకు ఎకరాకు రూ.50 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. పశువులతో పంటలను మేపొద్దని, అధికారులు వచ్చి చూసే వరకు ఆగాలని సూచించారు. యూరియా కొరతకు కారణమైన ఏఓ శ్రీనివాస్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని, తప్పుడు నివేదికలు ఇస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించారు. యూరియాను కాంగ్రెస్ నాయకులు బ్లాక్ మార్కెట్‌కు విక్రయిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్‌గౌడ్, బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటనర్సయ్య, బంధారపు శ్రీనివాస్‌గౌడ్, ఆబోతు అశోక్, వెంకన్న, బాలకిషన్, గొంది నాగేశ్వర్‌రావు, మౌలానా, మురళి, తోట రవి, తదితరులు పాల్గొన్నారు.