
రైతులను గోస పెడుతున్న రేవంత్‌రెడ్డి
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
● యూరియా కోసం రాయపర్తిలో ధర్నా
● అరెస్టు చేసిన పోలీసులు
రాయపర్తి: బూటకపు హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రజాపాలన చేతకావడంతోనే యూరి యా కొరత వచ్చిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరి యా కొరతను నిరసిస్తూ శుక్రవారం మండల కేంద్రంలోని వరంగల్–ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. సీ ఎం రేవంత్‌రెడ్డి రైతులను గోస పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఎ క్కడా యూరియా కొరత రానివ్వలేదన్నారు. ఇప్పు డు కాంగ్రెస్ నాయకులు, మంత్రులు చెబుతున్న మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ధర్నా చేస్తామనడంతో వెంటనే కాల్వల్లో నీళ్లను విడిచినట్లు తెలిపారు. ఎస్సైలు ముత్యం రాజేందర్, రాజు ఆధ్వర్యంలో దయాకర్‌రావును అరెస్ట్ చేసి జీపులో తరలిస్తుండగా వందల సంఖ్యలో చేరుకున్న రైతులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. అయినప్పటికి పోలీసులు దయాకర్‌రావును పోలీస్‌స్టేషన్‌వైపు తరలించారు. అనంతరం యూరియా కష్టాలు తీర్చాలని కార్యకర్తలు, రైతులు తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మూ నావత్ నర్సింహానాయక్, మాజీ ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రంగు కుమార్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పూస మధు, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, ఐత రాంచందర్, రంగారెడ్డి, ఎలమంచ శ్రీనివాస్‌రెడ్డి, చిన్నాల రాజబాబు, బండి రాజబాబు, బొమ్మెర వీరస్వామి పాల్గొన్నారు.