
పింగిళిలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు
విద్యారణ్యపురి: హనుమకొండ వడ్డేపెల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో 2025 – 2026వ విద్యా సంవత్సరానికి వివిధ సబ్జెక్టులలో విద్యాబోధనకు అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రమౌళి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బయో టెక్నాలజీలో –1, స్టాటిస్టిక్స్ 1, అప్లైడ్ నూట్రీషన్ 1, బీసీఏ 1, కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ 2, డేటాసైన్స్ 1, ఇంగ్లిష్ 1, మ్యాథమెటిక్స్ 1, బీబీఏ రిటైల్ 1, మైక్రో బయాలజీలో (1) ఖాళీలకు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 23 సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో తమ బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 24న ఉదయం ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. పీహెచ్‌డీ, నెట్, స్లెట్, సెట్‌తో పాటు అనుభవం, అర్హతలను బట్టి ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.
కాకతీయ డిగ్రీ కళాశాలలో..
విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025 – 2026వ విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) –3, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రిటైల్ ఆపరేషన్స్ 1, బీసీఏ 1, బిజినెస్ అనలిటిక్స్ 1, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ 3, క్రాప్ ప్రొడక్షన్ 1, డేటా సైన్స్ 1, ఎలక్ట్రానిక్స్ 1, ఫిషరీస్ 1, మైక్రో బయాలజీ 1, స్టాటిస్టిక్స్ (1) కోర్సుల విద్యాబోధనకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లతో ఈ నెల 24న సాయంత్రం 4గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాల కోసం వైస్ ప్రిన్సిపాల్ రజనీలతను సంప్రదించాలని సూచించారు.
30న జిల్లా స్థాయి
జూడో పోటీలు
రామన్నపేట: నగరంలోని కెమిస్ట్ భవన్‌లో ఈ నెల 30న సబ్ జూనియర్స్, కేడెట్ విభాగాల్లో బాల బాలికలకు ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి జూడో పోటీలు నిర్వహించనున్నట్లు తెలంగాణ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు బైరబోయిన కై లాష్ యాదవ్ తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సబ్ జూనియర్ విభాగంలో పాల్గొనే బాల బాలికలు విభాగాల వారీగా 2011 – 2013వ సంవత్సరాల్లో జన్మించి ఉండాలని, బాలురు 30 – 66 కిలోలలోపు, బాలికలు 28 – 57 కిలోల బరువు ఉండాలని పేర్కొన్నారు. కేడెట్ విభాగంలో పాల్గొనే బాల బాలికలు విభాగాల వారీగా 2008 – 2010వ సంవత్సరాల్లో జన్మించి ఉండాలని, బాలురు 50 – 90 కిలోల లోపు, బాలికలు 40 – 90 కిలోలలోపు ఉండాలని తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు ఒరిజినల్ వెంట తీసుకొని రావాలని కోరారు. జిల్లా స్థాయిలో ఎంపికై న క్రీడాకారులు ఆగస్టు 5, 6వ తేదీల్లో జరగనున్న రాష్ట్ర స్థాయి జూడో పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలకు 99899 53253 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్
పోటీలకు ఎంపిక
వరంగల్ స్పోర్ట్స్: ఈ నెల 24 నుంచి 27వ తేదీ వరకు గద్వాలలో జరగనున్న 10వ జూనియర్ అంతర్ జిల్లాల బాస్కెట్‌బాల్ పోటీలకు వరంగల్ జిల్లా బాలుర జట్టు ఎంపిక పూర్తైనట్లు వరంగల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పృథ్వీశ్వర్ రెడ్డి, రమేష్ తెలిపారు. ఈ నెల 6వ తేదీన హనుమకొండ కుమార్‌పల్లిలోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో జిల్లా స్థాయి ఎంపికను నిర్వహించగా, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసినట్లు వివరించారు.
25నుంచి పలు రైళ్లు రద్దు
కాజీపేట రూరల్: కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని పెద్దపల్లి బైపాస్ లైన్ వర్క్స్, బల్లార్షా – కాజీపేట సెక్షన్‌లో రైల్వే బ్లాక్‌తో ఈనెల 25వ తేదీ నుంచి పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు సోమవారం తెలిపారు. కాజీపేట మీదుగా బల్లార్షా, వరంగల్ మీదుగా కరీంనగర్ నుంచి కాగజ్‌నగర్ వరకు ప్రయాణించే పలు ప్యాసింజర్ రైళ్లను కాజీపేట వరకు మాత్రమే నడిపించనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.

పింగిళిలో అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు