
ప్రజా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పరుగులు
హన్మకొండ: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ నగర్‌లో ఆహార భద్రత (రేషన్) కార్డుల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అభివృద్ధి పడకేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇచ్చిన మాట మేరకు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. త్వరలో టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, అంతకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కార్డులు ఇవ్వగా, ఇప్పుడు తిరిగి తమ ప్రభుత్వ హయాంలోనే కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో 2,469 కొత్త రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఆర్డీఓ రమేష్ రాథోడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, రవీందర్ యాదవ్, వేముల శ్రీనివాస్, విజయశ్రీ రజాలీ, మానస, పోతుల శ్రీమాన్, మామిండ్ల రాజు, చీకటి శారద, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, గాండ్ల స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.
డబుల్ బెడ్రూం ఇళ్లు పంచుడే..
హనుమకొండ బాలసముద్రంలోని డబుల్ బెడ్రూం ఇళ్లను త్వరలోనే లబ్ధిదారులకు పంచనున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సోమవారం డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలని అనుకున్నామని, సెలవు దినం కావడంతో వాయిదా వేశామన్నారు. అంబేడ్కర్‌నగర్, జితేందర్ నగర్‌కు చెందిన అర్హులందరికి ముందుగా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామన్నారు. గత జాబితాలో నలుగురైదుగురు ఉద్యోగులున్నట్లు తేలిందన్నారు. అనర్హులను దొరకబట్టింది తామేనని ఎమ్మెల్యే నాయిని తెలిపారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే
నాయిని రాజేందర్ రెడ్డి