
తేలికపాటి నుంచి భారీ వర్షం
హన్మకొండ: వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురవగా, మరికొన్న ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైంది. సోమవా రం రాత్రి 7 గంటల వరకు ఆటోమేటిక్ వెదర్ స్టేష న్‌లో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగళవారిపేటలో అత్యధికంగా 88.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. హనుమకొండ జిల్లాలో మడికొండ, భీమదేరపల్లిలో అత్యల్పంగా 3.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లిలో 76 మిల్లీ మీటర్లు, నల్లబెల్లిలో 69.3, చెన్నారావుపేటలో 60.3, నర్సంపేట మండలం లక్నేపల్లిలో 48.3, దుగ్గొండిలో 44.8, నెక్కొండలో 44.5, పర్వతగిరి మండలం ఏనుగల్‌లో 37.5, సంగెంలో 34.5, గీసుకొండలో 24.8, వర్ధన్నపేటలో 24, గీసుగొండ మండలం గొర్రెకుంటలో 17.3, రాయపర్తిలో 13.5, సంగెం మండలం కాపుల కనపర్తిలో 12.5, వరంగల్ కాశిబుగ్గలో 8.5, పైడిపల్లి ఏఆర్‌ఎస్‌లో 8, నెక్కొండ మండలం రెడ్లవాడలో 7.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మరిపల్లి గూడెంలో 33 మిల్లీ మీటర్లు, హసన్‌పర్తి మండలం నాగారంలో 25, ఆత్మకూరులో 24.3, శాయంపేటలో 20, దామెర మండలం పులుకుర్తిలో 19.3, నడికూడలో 17.5, దామెరంలో 17.5, కమలాపూర్‌లో 17, పరకాలలో 16.5, వేలేరులో 12.5, హసన్‌పర్తి చింతగట్టులో 8.5, కాజీపేటలో 8.5, ఎల్కతుర్తిలో 4.8, ఐనవోలు మండలం కొండపర్తిలో 3.8, ఐనవోలులో 3.8, ధర్మసాగర్‌లో 3.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.