
ఏఐతో విద్యాబోధన: నిట్ డైరెక్టర్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్ అధ్యాపకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ సూచించారు. టెక్నాలజీ ఎనెబుల్డ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అనే అంశంపై నిట్‌లోని అంబేడ్కర్ లర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజులపాటు కొనసాగనున్న వర్క్‌షాప్‌ను నిట్ డైరెక్టర్ సోమవారం ప్రారంభించి మాట్లాడారు. తరగతి గదుల్లో పుస్తకాల్లోని పాఠ్యాంశాలనే కాకుండా నిజజీవితంలోని ఎదురయ్యే సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో వివరించాలన్నారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగడానికి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఐఐటీ బాంబే ప్రొఫెసర్ కన్నన్ మౌధాల్యా, ఐఐటీ గాంధీనగర్ ప్రొఫెసర్ సమీర్ సహస్ర బుదే, నిట్ టీటీఆర్ చైన్నె ప్రొఫెసర్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.