
అరటి సాగుకు ప్రోత్సాహం..
పండ్ల తోటల సాగును ప్రోత్సహించడంలో భాగంగా అరటి సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్ర భుత్వం రాయితీ అందిస్తోంది. వరంగల్ జిల్లాలో 393 ఎకరాల్లో, హనుమకొండ జిల్లాలో 470 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నారు. అరటిని టిష్యూ కల్చర్, పిలకల పద్ధతిలో సాగు చేస్తారు. ఈరెండు సాగు పద్ధతులకు ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రాయితీ అందిస్తోంది. టిష్యూ కల్చర్ మొక్కల ద్వారా సాగుకు నిర్వహణ ఖర్చులకు 40 శాతం బంచు కవర్స్ సాగుకు 50 శాతం రాయితీని అందిస్తున్నారు. టిష్యూ కల్చర్ అరటి సాగుకు ఎకరాకు రూ.28 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు, బంచ్ కవర్స్ అరటి సాగుకు ఎకరానికి రూ.10 వేల చొప్పున ఒక్కో రైతుకు 5 ఎకరాల వరకు రాయితీ అందిస్తున్నారు.