
ఆయిల్‌పామ్ సాగుతో అధిక లాభాలు
● నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
దుగ్గొండి: రైతులు ఆయిల్‌పామ్ సాగు చేసి మెలకువలు పాటించి అధిక లాభాలు పొందాలని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండల పరిధిలోని లక్ష్మీపురంలో పలువురు రైతుల వ్యవసాయ క్షేత్రాలలో ఎమ్మెల్యే ఆదివారం ఆయిల్‌పామ్ మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆయిల్‌పామ్ పంటకు ప్రభుత్వం అధిక రాయితీలు అందిస్తుందన్నారు. నాలుగేళ్లపాటు ఓపిక పడితే 30 ఏళ్ల వరకు నిరంతరాయంగా ఆదాయం పొందవచ్చని తెలిపారు. దిగుబడికి మద్దతు ధర చెల్లించే విషయంలో ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందన్నారు. రైతులు యూరియాను విచ్చలవిడిగా వాడకుండా నానో యూరియా, నానో డీఏపీ పిచికారీ చేయాలని వెల్ల డించారు. ఆధునిక పద్ధతుల్లో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు, డివిజన్ అధికారి జ్యోతి, రామ్‌చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ జీఎం సతీష్‌నారాయణ, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాసరెడ్డి, పీసీసీ సభ్యుడు సొంటిరెడ్డి రంజిత్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చుక్క రమేష్, మాజీ అధ్యక్షుడు ఎర్రల్ల బాబు, వర్కింగ్ ప్రెసిడెంట్‌లు చెన్నూరి కిరణ్‌రెడ్డి, నర్సింగరావు, రైతులు దామోదర్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, సంపత్‌రావు, యుగేంధర్, వెంకటేశ్ పాల్గొన్నారు.