
‘వయోవృద్ధుల’ చట్టంపై అవగాహన అవసరం
పరకాల: వయోవృద్ధుల వివిధ రకాల అవసరాలు తీర్చేందుకు తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని పరకాల ఆర్డీఓ డాక్టర్ కె.నారాయణ తెలిపారు. వయోవృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యలు – పరిష్కార మార్గాలు అనే అంశంపై వయోవృద్ధుల సంక్షేమ సంస్థ పరకాల అధ్యక్షుడు రేపాల నర్సింహారాములు అధ్యక్షతన పరకాల ఆర్డీఓ కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీఓ నారాయణ మాట్లాడుతూ చట్టం అమలుకు పరకాల వయోవృద్ధుల సంక్షేమ సంస్థ నుంచి ముగ్గురు సభ్యులతో ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి, వయోవృద్ధుల నుంచి వచ్చిన 50 ఫిర్యాదులలో 26 పరిష్కరించినట్లు వివరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ డీఎస్పీ దామెర నర్సయ్య, పరకాల ఐసీడీఎస్ సీడీపీఓ స్వాతి, వయోవృద్ధుల సంక్షేమ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి యుగేందర్, ట్రిబ్యునల్ సభ్యులు భూషి ప్రభాకర్‌రెడ్డి, కోడిపాక సమ్మయ్య, సుంకర రామన్న, సభ్యులు నర్సయ్య, రవీందర్‌గౌడ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

‘వయోవృద్ధుల’ చట్టంపై అవగాహన అవసరం